Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాలో చంద్రుడు తలక్రిందులు కనిపిస్తాడా? నెటిజన్లకు షాక్ ఇస్తున్న వైరల్ పోస్ట్

ఆస్ట్రేలియాలో చంద్రుడు తలకిందులుగా కనిపిస్తున్నాడని ఓ నెటిజన్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో సంచలనం రేపింది. అనేక మంది నెటిజన్లు డిబేట్‌ ప్రారంభించారు. పోస్టును సమర్థించిన సైన్స్ కథనాలను షేర్ చేసుకున్నారు.
 

moon appears upside down in australia, what viral post says kms
Author
First Published Apr 20, 2023, 11:49 PM IST

న్యూఢిల్లీ: సౌరవ్యవస్థ గురించి ఇంకా అనేక రహస్యాలు నిగూఢంగానే ఉన్నాయి. సౌర వ్యవస్థ కాదు.. భూమి, భూ ఉపగ్రహం చుట్టూ అనేక చిన్న చిన్న విషయాలూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భూ ఉపగ్రహం చంద్రుడి గురించి మనకు దాదాపు మొత్తం తెలుసనే అనుకుంటాం. కానీ, రెడ్డిట్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్టు ఇప్పుడు షాకింగ్‌గా మారింది. 

తాను ఇటీవలే ఆస్ట్రేలియాలోని తన భాగస్వామి వద్దకు వెళ్లారని, అక్కడ తాను ఒక ఆశ్చర్యకర విషయం గమనించానని వివరించారు. ఆస్ట్రేలియా ప్రజలకు చంద్రుడు తలకిందులుగా కనిపిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ పోస్టు నెట్టింట సంచలనంగా మారింది. నెటిజన్ల ఓ డిబేట్‌నే మొదలు పెట్టారు.

యూకేలోని ప్రజలే చంద్రుడిని అప్‌సైడ్‌డౌన్‌గా చూస్తారని పేర్కొన్నాడు. మరొకరు తాను యూరోప్‌లో నివసిస్తున్న ఆస్ట్రేలియన్ అని పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ చంద్రుడు తలకిందులుగా కనిపిస్తున్నాడని తెలిపాడు.

I recently visited my partner in Australia and it completely blew my mind that the moon looks upside down there.
by u/trimdaddyflex in interestingasfuck

న్యూజిలాండ్‌లో తాము చంద్రుడిని ఎలా చూడాలో అలాగే కనిపిస్తున్నాడని ఇంకో యూజర్ పేర్కొన్నాడు. ఉత్తరార్ధ గోళంలో నివసించే మీకే చంద్రుడు తలకిందులుగా కనిపిస్తాడని వివరించాడు.

Also Read: వేల ఏళ్ల క్రితం నాటి గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలా రివీల్ చేస్తుంది? దీని ప్రత్యేకత ఏమిటి?

భూ ఉత్తరార్థ గోళంలో నివసించే వ్యక్తి దక్షిణార్థ గోళంలోని దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లినప్పుడు వారు ఎప్పుడూ చూసే చంద్రుడిలో తేడాలు ఉంటాయని ఫోర్బ్స్ పత్రిక కథనం ఒకటి పేర్కొంది. ఉత్తరార్థ గోళం నుంచి దక్షిణార్థ గోళానికి వెళ్లినప్పుడు చంద్రుడు తలకిందులుగా కనిపిస్తాడని వివరించింది.

ఒక వ్యక్తి ఉత్తర ధ్రువం వద్ద నిలుచుని ఆకాశంకేసి చూస్తుంటే.. అతని మిత్రుడే దక్షిణ ధ్రువం వద్ద ఆకాశానికేసి చూసినప్పుడు వారిద్దరూ చంద్రుడిని వేర్వేరుగా చూస్తారు అని ఓ సైన్స్ అలర్ట్ కథనం వివరించింది. వారిద్దరి దృష్టి పూర్తిగా వ్యతిరేకంగా కలుస్తాయని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios