చర్చిల ధ్వంసం, 400 ఇళ్లకు నిప్పు.. పట్టించుకోని ప్రభుత్వం : పాక్‌లో క్రైస్తవుల కన్నీటి వ్యథ (వీడియో)

పాకిస్తాన్‌లో క్రైస్తవ సమాజానికి చెందిన వారు ప్రతిరోజు ప్రపంచాన్ని సహాయం కోరుతూ వీడియోలను నిరంతరాయంగా విడుదల చేస్తున్నారు. అలాగే వారు ఎలా చంపబడుతున్నారో తెలియజేస్తున్నారు. 

Mob attacks on Christian churches and homes in Pakistan ksp

పాకిస్థాన్‌లో హిందువులు, ఇతర క్రిస్టియన్ సమాజంపై దాడులు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న సంగతి తెలిసిందే. బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకోవడం వంటి ఘటనలు అక్కడ నిత్యకృత్యం. తాజాగా మంగళవారం ఉదయం లాహోర్‌లోని ఒక మసీదు నుండి క్రైస్తవులపై దాడి చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. దీనికి ముందు ఫైసలాబాద్‌లోని ఓ చర్చిపై ఉర్దూలో 'మేం వచ్చాం..' అని రాసి క్రైస్తవులను భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. చర్చిపై రాసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమకు సాయం చేయాల్సిందిగా కోరారు. 

అదే సమయంలో, పొరుగు దేశాల కంటే పాకిస్తాన్‌లో మైనారిటీలు చాలా సురక్షితంగా ఉన్నారంటూ పంజాబ్ ప్రావిన్స్ పోలీసు చీఫ్ వ్యాఖ్యానించారు. కానీ వాస్తవంలో పరిస్ధితులు వేరే వున్నాయి. ఇక్కడ క్రైస్తవ సమాజానికి చెందిన వారు ప్రతిరోజు ప్రపంచాన్ని సహాయం కోరుతూ వీడియోలను నిరంతరాయంగా విడుదల చేస్తున్నారు. అలాగే వారు ఎలా చంపబడుతున్నారో తెలియజేస్తున్నారు. మంగళవారం ఉదయం లాహోర్‌లోని షేక్‌పూర్ ప్రాంతంలో ఓ గొడవ జరిగింది. ఈ ఘటన తర్వాత అక్కడి స్థానిక మసీదు నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలిరావాల్సిందింగా ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు అక్కడి నుండి పరుగులు తీయడం ప్రారంభించారు. తమ ప్రాణాలను, ఆస్తిని కాపాడాలని వేడుకుంటూ వీడియోను విడుదల చేశారు.

 

 

సదరు వీడియోలో.. క్రైస్తవ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి ఈ ఉదయం తనకు ఎదురైన కష్టాలను పంచుకున్నాడు. ఫైసలాబాద్‌లోని రహమత్‌ టౌన్‌లోని ఓ చర్చి బయటి గోడపై ‘‘ మహ్మద్ ’’, ‘‘‌ అల్లా ’’ అనే పదాలు రాసి ‘‘ మేము వచ్చామని’’ రాశారు. చర్చికి చెందిన వ్యక్తుల సమస్య ఏమిటంటే, వీరు గనుక చర్చి గోడపై వ్రాసిన మహ్మద్ లేదా అల్లా పేరును తొలగిస్తే, వారిపై దైవదూషణ కింద కేసు పెట్టవచ్చు. అక్కడి నుంచి పారిపోవాలని, లేకుంటే చంపేస్తామని అక్కడి క్రైస్తవ సంఘానికి బెదిరింపులు సైతం వచ్చాయి.

ఈ ఘటనలకు ముందు జరన్‌వాలా నగరంలో 20 చర్చిలను ముస్లింలు తగులబెట్టారు. 400కు పైగా ఇళ్లను ధ్వంసం చేసి తగులబెట్టారు. ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే.. క్రైస్తవ సమాజానికి చెందిన వ్యక్తులు వీడియోలను విడుదల చేసి సహాయం కోరినప్పుడు పాకిస్తాన్ అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు, క్రైస్తవ సంఘాల ఆందోళనల తర్వాత పాక్ ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చేలా చర్యలు చేపట్టింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios