Asianet News TeluguAsianet News Telugu

మిస్ యూనివర్స్ 2023:నికరాగువాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ కు స్వంతం


విశ్వసుందరి కిరీటం నికరాగువాకు దక్కింది.  అందాల పోటీల్లో  నికరాగువా కు చెందిన షెన్నిస్ పలాసియోస్ కు టైటిల్ దక్కింది.  గతంలో  ఈ టైటిల్ ను  ఆర్ బానీ గాబ్రియేల్ దక్కించుకుంది.
 

Miss Universe 2023 is Sheynnis Palacios from Nicaragua lns
Author
First Published Nov 19, 2023, 10:35 AM IST


న్యూఢిల్లీ:మిస్ యూనివర్స్ (విశ్వ సుందరి) కిరీటాన్ని  నికరాగువాకు చెందిన షెన్నిస్ పలాసియోస్  దక్కించుకున్నారు. మిస్ యూనివర్స్ 2023  టైటిల్ షెన్నిస్ దక్కించుకున్నారు.  

 

మాజీ మిస్ యూనివర్స్  ఆర్ బానీ గాబ్రియేల్ విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళ షెన్నిస్  పలాసియోస్.అందాల పోటీలో  అస్ట్రేలియాకు చెందిన మోరయో విల్సన్ రెండో రన్నరప్ గా నిలవగా, థాయ్ లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ గా నిలిచారు.

ఈ ఏడాది భారత్ కు చెందిన  శ్వేతా  శారదా మిస్ 2023 లో  భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు. చంఢీగఘ్ రాష్ట్రంలో శ్వేతా  శారదా జన్మించారు.  ప్రపంచ అందాల సుందరి  పోటీల్లో  టాప్  20 ఫైనలిస్టుల జాబితాలోకి  శ్వేతా శారదా చోటు దక్కించుకుంది. పాకిస్తాన్ కూడ  ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది.ఈ ఏడాది జరిగిన  72వ మిస్ యూనివర్స్ పోటీల్లో  84 దేశాల నుండి పోటీదారులు పాల్గొన్నారు.  ఈ పోటీని అమెరికన్  టెలివిజన్ ప్రజెంటర్ మరియా మెనౌనోస్ కాకుండా అమెరికన్ టెలివిజన్ పర్సనాలిటీ జెన్నీ మై , మిస్ యూనివర్స్  2012  ఒలివియా కల్పో కలిసి హోస్ట్ చేశారు.సెంట్రల్ అమెరికన్ దేశం  1975 తర్వాత  తొలిసారి  మిస్ యూనివర్స్ పోటీలను ప్రారంభించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios