సారాంశం

చిన్నారిపై అత్యాచారం జైలుకువెళ్లి... సత్ప్రవర్తనతో జైలునుండి విడుదలైన ఓ ఉన్మాది సొంత భార్యాబిడ్డలు, స్నేహితులను కాల్చిచంపి సూసైడ్ చేసుకున్నాడు. 

న్యూయార్క్ : చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి 16 ఏళ్లు జైలుశిక్ష అనుభవించినా అతడి తీరులో మార్పు రాలేదు. జైలు నుండి విడుదలయ్యాక మళ్ళీ అలాగే అసభ్యకర పనులకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. దీంతో మరోసారి ఎక్కడ జైలుకు వస్తుందోనని భయపడిపోయిన అతడు భార్యా, ముగ్గురు పిల్లలు. ఇద్దరు స్నేహితులను కాల్చిచంపి అదే గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.  ఈ దారుణం అమెరికాలో చోటుచేసుకుంది. 

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం హెన్రిట్టా పట్టణంలో గత సోమవారం ఓ ఇంట్లో ఏడుగురి మృతదేహాలు లభించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే వీరిని హత్యచేసి తనను తాను కాల్చుకున్నది ఆ ఇంటి యజమాని జెస్సీ మెక్ ఫాడెన్(39) గా పోలీసులు గుర్తించారు.

ఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో  2003 లో అరెస్టయిన ఫాడెన్ 16 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. జైల్లో సత్ప్రవర్తనతో మెలిగిన అతడిని శిక్షకాలం కంటే నాలుగేళ్ల ముందుగానే విడుదల చేసారు అధికారులు. కానీ బయటకు వచ్చాక ఫాడెన్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. నీలిచిత్రాల వ్యాపారం చేస్తూ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మళ్లీ ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని అతడు భయపడి దారుణానికి ఒడిగట్టాడు. 

Read More  హైదరాబాద్ లో చికెన్ పకోడీ గొడవ... యువకుడిపై కత్తితో దాడిచేసిన నిర్వహకుడు

నీలిచిత్రాల వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఫాడెన్ ను పోలీసులు విడుదలచేసారు. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిన అతడు ముందు భార్యా, ముగ్గురు పిల్లలను గన్ తో కాల్చిచంపాడు. ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులను ఇలాగే కాల్చిచంపాడు. ఇలా ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఫాడెన్ చివరకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.