ట్రంప్‌పై ఇండియన్ ఇమ్మిగ్రేంట్స్ సమరం: నిరాహార దీక్షలు

First Published 29, Jun 2018, 10:45 AM IST
Migrants from India on hunger strike at ICE detention centers in Georgia
Highlights

జీరో టోలరెన్స్‌‌లో భాగంగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులను అరెస్ట్ సరి నిర్భంధ కేంద్రాల్లో బందీలుగా ఉంచున్న సంగతి మనందరికీ తెలిసినదే.

జీరో టోలరెన్స్‌‌లో భాగంగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులను అరెస్ట్ చేసి నిర్భంధ కేంద్రాల్లో బందీలుగా ఉంచుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఇలా నిర్బంధానికి గురైన వారిలో మన దేశానికి చెందిన వారు కూడా సుమారు వంది మంది వరకూ ఉన్నారు. వారందరినీ తక్షణమే విడుదల చేయాలని అమెరికాలోని భారతీయ వలసదారులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయని పక్షంలో నిరాహారదీక్షకు దిగుతామని చెబుతున్నారు.

ఈమేరకు సౌత్ ఏషియన్ బార్ అసోసియేషన్ ఆఫ్ జార్జియా, ఏషియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ అట్లాంటా మరియు సిక్ కమ్యూనిటీకి చెందిన సభ్యులందరూ కలిసి సంయుక్తంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నర్వహించారు. ఇప్పటికే నిర్భంధించిన వారిని తమ కుటుంబాలతో, స్పాన్సర్లతో కలపాలని లేకపోయినట్లయితే భారతదేశం నుంచి అలాగే ఇతర దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వలసదారులంతా కలిసి నిరాహారదీక్ష చేస్తామని ఐస్ అధికారులు, డిటెన్షన్ అధికారులను డిమాండ్ చేశారు.

సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారంటూ దాదాపు వంద మంది భారతీయులను నిర్బంధించిన సంగతి తెలిసిందే.న్యూమెక్సికోలోని ఫెడరల్ డిటెన్షన్ కేంద్రంలో, ఓరేగాన్ డిటెన్షన్ కేంద్రంలో నిర్బంధించిన తెలిసినదే. వీరిలో ఎక్కువ మంది హిందీ మాట్లాడుతున్నారని, పంజాబ్‌కు చెందిన సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నారని సమాచారం.

loader