Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఆన్‌లైన్‌ ప్రేమికుడికోసం ఐదువేల కి.మీ. దాటి వచ్చింది.. ఆర్గాన్స్ దొంగలచేతిలో హతమయ్యింది..

ఆన్ లైన్ ప్రేమికుడి కోసం ఐదువేల కిలోమీటర్లు దూరం వెళ్లిన మహిళ.. దారుణమైన పరిస్థితుల్లో మృత్యువాత పడింది. ఇది పెరూలోని హువాచో బీచ్‌లో వెలుగులోకి వచ్చింది. 

Mexican Woman Flew Nearly 5,000 KM To Meet Online Friend, and Killed For Organs in Peru
Author
First Published Nov 25, 2022, 1:22 PM IST

పెరూ : ఓ 51యేళ్ల మహిళ ఆన్ లైన్ లో ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆమె మెక్సికన్. అతను పెరూలో ఉంటాడు. కొద్దిరోజుల తరువాత అతడిని వ్యక్తిగతంగా కలుసుకుని తమ ప్రేమను పండించుకోవాలనుకుంది. అందుకోసం మెక్సికో నుంచి పెరూకి 5000కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. 

దీంతో ఆమె బంధువులు ఆమె కోసం ప్రకటనలు ఇవ్వగా.. పెరూలోని హువాచో బీచ్‌లో ఛిద్రమైన స్థితిలో ఆమె మృతదేహం అక్కడి జాలర్లకు దొరికింది. వారు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. విచారణలో ఆ మృతదేహం మెక్సికోనుంచి వచ్చి కనిపించకుండా పోయిన మహిళదని తెలిసింది. ఆమె శరీరంలోని అవయవాలు దొంగిలించబడినట్టు పోలీసులు గుర్తించారు. ఇది నవంబర్ 9న జరగింది. 

చైనాలోని జిన్జియాంగ్ లో అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. 9 మందికి గాయాలు

ది ఇండిపెండెంట్ ప్రకారం..బ్లాంకా అరెల్లానో అనే ఆ మహిళ జూలై నెలాఖరున తన కుటుంబ సభ్యులతో తాను లిమాకు విహారయాత్రకు వెళతానని చెప్పింది. అక్కడే తాను చాలాకాలంగా ఆన్ లైన్ లో ప్రేమించుకుంటున్న జువాన్ పాబ్లో జీసస్ విల్లాఫుర్టేను కలవాలని అనుకున్నట్లు వారు తెలిపారు. దీనికోసం అరెల్లానో తన 37 ఏళ్ల పెరువియన్ బాయ్‌ఫ్రెండ్ ఉండే బీచ్ సిటీ ఆఫ్ హువాచోను వెళాలనుకున్నట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఇదే చివరగా వారికి ఆమెనుంచి తెలిసిన సమాచారం. 

నవంబర్ 7న ఆమె చివరగా వారితో కాంటాక్ట్ లోకి వచ్చింది. ఇక న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియా ప్రకారం, బ్లాంకా మేనకోడలు కార్లా అరెల్లానో నవంబర్ 7న తన ఆంటీతో మాట్లాడినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఆ సమయంలో ఆమె సంతోషంగా ఉంది. అంతా బాగానే ఉందని.. ఆమె ప్రేమలో ఉందని.. అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఆమె కాంటాక్ట్ మిస్ అయ్యింది. అదే ఆమెతో చివరిసారి మాట్లాడడం.. రెండు వారాల మౌనం తర్వాత, బ్లాంకాను గుర్తించడంలో సహాయం చేయమంటూ ఆమె మేనకోడలు ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేసింది, ఇది ఆమె ఆచూకీపై దర్యాప్తు ప్రారంభించేందుకు స్థానిక పోలీసులను ప్రేరేపించింది.

"నేను ఈ పరిస్థితిలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు, ఈ రోజు నేను నా జీవితంలో అత్యంత ప్రియమైన, ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిని గుర్తించడానికి సహాయం అడుగుతున్నాను" అని కార్లా ట్విట్టర్ పోస్ట్‌లో రాశారు, ఇది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ అయ్యింది. "నా అత్త, బ్లాంకా ఒలివియా అరెల్లానో గుటిరెజ్, సోమవారం, నవంబర్ 7, పెరూలో అదృశ్యమయ్యారు, ఆమె మెక్సికన్ మహిళ. ఆమె ప్రాణాలకు ఏమైనా హాని జరిగిందా అని మేం భయపడుతున్నాం"అని ఆమె రాసుకొచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios