Asianet News TeluguAsianet News Telugu

ఉబ్బిన కళ్లు, ఒళ్లంతా గాయాలు: చోక్సీ ఫోటోలు విడుదల చేసిన డొమినికా మీడియా

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మొహల్ చోక్సీ ప్రస్తుతం డొమినికాాలోని పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ దేశం నుండి పారిపోయే ప్రయత్నం చేసిన సమయంలో పోలీసులు ఆయనను పట్టుకొన్నారు.  మొహల్ చోక్సీ ఫోటోను  డొమినికా మీడియా విడుదల చేసింది. 

Mehul Choksis first pictures from Dominica surface show swollen red eyes bruised arms lns
Author
Dominica, First Published May 30, 2021, 11:09 AM IST

డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మొహల్ చోక్సీ ప్రస్తుతం డొమినికాాలోని పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ దేశం నుండి పారిపోయే ప్రయత్నం చేసిన సమయంలో పోలీసులు ఆయనను పట్టుకొన్నారు.  మొహల్ చోక్సీ ఫోటోను  డొమినికా మీడియా విడుదల చేసింది. ఈ ఫోటోల్లో బాగా ఉబ్బడంతో పాటు ఎర్రగా మారిన కళ్లతో చోక్సీ కన్పించాడు.  జైల్లో ఉన్న ఆయన ఫోటోలను  డొమినికా మీడియా ఫోటో విడుదల చేసింది. తన క్లయింట్ ను తీవ్రంగా కొట్టారని చోక్సీ న్యాయవాది వేన్ మార్ష్ ఆరోపించారు. ఆంటిగ్వాలో ఆయనను కిడ్నాప్ చేశారన్నారు.

also read:క్యూబాకు పారిపోతూ పట్టుబడిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ

అంతేకాదు అక్కడి నుండి ఆయనను డొమినికాకు తీసుకొచ్చారని చెప్పారు. తనను తన క్లయింట్ తో మాట్లాడేందుకు మే 27న మాత్రమే అవకాశమిచ్చారన్నారు. అతనిని తీవ్రంగా కొట్టడం వల్ల కళ్లు వాచి ఉన్నాయన్నారు. అంతేకాదు శరీరంపై అనేక కాలిన గుర్తులున్నట్టుగా తాను గుర్తించినట్టుగా చెప్పారు. అంటిగ్వాలోని జాలీ హర్బర్ వద్ద చోక్సీ కిడ్నాప్ అయ్యారన్నారు. అంటిగ్వాన్ పోలీసు అని నమ్మే వ్యక్తులే తనను డొమినికాకు తీసుకొచ్చారని తనకు చోక్సీ చెప్పారని లాయర్ తెలిపారు. తనను 60 నుండి 70 అడుగుల పొడవున్న నౌకలో కిడ్నాప్ చేశారని చోక్సీ చెప్పినట్టుగా ఆయన లాయర్ మార్ష్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడుగా ఉన్న చోక్సీ 2018 నుండి అంటిగ్వా, బార్బడాలో నివసిస్తున్నాడు. 62 ఏళ్ల చోక్సీ గత ఆదివారం నాడు అదృశ్యమయ్యారు. డొమినికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. పారిపోతున్న సమయంలో అతడిని పట్టుకొన్నట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. మొహల్ చోక్సీని అప్పగించడంపై డొమినికాలోని ఓ న్యాయస్థానం స్టే పొడిగించింది. ఈ కేసుపై జూన్ 2వ తేదీకి నిర్ణయించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios