ఓ కుక్క తన యజమానిని మిలీనియర్ ని చేసింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. దాని సంవత్సర ఆదాయం రూ.8కోట్లు. మరి ఆ కుక్క స్పెషాలిటీ ఏంటో మనమూ తెలుసుకుందాం...
మనలో చాలా మందికి కుక్కలంటే అమితమైన ఇష్టం ఉండొచ్చు. ఆ ఇష్టంతో దానిని పెంచుకునేవాళ్లు కూడా లేకపోలేదు. కానీ, అమ్మె కుక్కను పెంచడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దానిని మనం ఎక్కడ పెంచుతాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా ఓ కుక్క తన యజమానిని మిలీనియర్ ని చేసింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. దాని సంవత్సర ఆదాయం రూ.8కోట్లు. మరి ఆ కుక్క స్పెషాలిటీ ఏంటో మనమూ తెలుసుకుందాం...
అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన బడ్జిన్ అనే మహిళ 8 వారాల వయసులో ఓ కుక్కను తెచ్చి పెంచుతోంది. దానికి టక్కర్( అని పేరుపెట్టింది. uckerbudzyn పేరుతో ఇన్‌స్టాగ్రమ్ బ్లాగ్ క్రియేట్ చేసి టక్కర్‌తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఒక నెల తర్వాత టక్కర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దీంతో ఆమె షాకైంది. ఈ పనేదే బాగుందే అని ఆమె అప్పటి నుంచి టక్కర్ వీడియోలను మరిన్ని అప్ లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోల ద్వారా ఆమెకు ఆదాయం రావడం మొదలైంది. ఇప్పుడు ఆ కుక్క ఆమెను మిలీనియర్ చేసేసింది. టక్కర్ సంవత్సరానికి దాదాపు 1 మిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. ఇది రూ. 8 కోట్ల, 28 లక్షలు సమానం.
యూట్యూబ్ యాడ్స్ ద్వారా కూడా ఈ కుక్క ఎక్కువగానే సంపాదిస్తోందట. ఓ యూట్యూబ్ ప్రకటనదారుడు టక్కర్‌కు 30 నిమిషాల ప్రీరోల్‌కోసం 40-60వేల డాలర్ల చెల్లిస్తాడని టక్కర్ యజమాని కోర్ట్నీ బడ్జిన్ తెలిపారు. ఇక టక్కర్ సంపాదిచడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ కుక్క యజమాని , ఆమె భర్త ఉద్యోగం మానేశారట. కేవలం దానిని చూసుకోవడమే ఓ పనిగా పెట్టుకున్నారట. ఇదంతా చూస్తుంటే మీకు కూడా ఓ కుక్కను పెంచి, దానితో డబ్బుులు సంపాదించాలని అనిపిస్తోంది కదా..
