Asianet News TeluguAsianet News Telugu

పాప్ కార్న్ వ్యాపారి... ఎయిరో ప్లేన్ తయారు చేశాడు..

పాప్ కార్న్ వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి...టీవీలో... ఇంటర్నెట్ లో చూసి.. ఏకంగా ఎయిరో ప్లేన్ తయారు చేశాడు. అతను తయారు చేసిన ప్లేన్ చూసి.. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ఆయనను అభినందించారు. 

Meet the Pakistani popcorn seller who built his own plane
Author
Hyderabad, First Published May 7, 2019, 11:34 AM IST

పాప్ కార్న్ వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి...టీవీలో... ఇంటర్నెట్ లో చూసి.. ఏకంగా ఎయిరో ప్లేన్ తయారు చేశాడు. అతను తయారు చేసిన ప్లేన్ చూసి.. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ఆయనను అభినందించారు. ఈ సంఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్ లోని పంజాబ్ పరిధిలోగల తాబూర్ కి చెందిన ఫయ్యజ్.. పెద్దగా చదువుకోలేదు. తమ తాతల, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న పాప్ కార్న్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. అతను ఇంటర్నెట్ లో చూసి ప్లేన్ తయారు చేశాడు. కేవలం
రోడ్ కట్టర్ ఇంజన్, రిక్షా టైర్లు, బ్లూ ప్రింట్స్ తదితర వాటి సహాయంతో ప్లెయిన్ తయారు చేశాడు. 

దీనికి ‘మినీ బేసిక్ ఎయిరో ప్లేన్’ అని పేరు పెట్టాడు. ఈ సందర్భంగా ఫయ్యజ్(32) మాట్లాడుతూ ‘నేను తయారు చేసిన ప్లెయన్ తొలిసారి గాలిలో ఎగిరింది. నాకు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. అప్పడు నాకు ఇంతకుమించినది మరొకటి లేదనిపించింది’ అన్నాడు. కాగా ఈ ప్లెయిన్ తయారు చేసేందుకు ఫయ్యజ్ రూ. 50 వేలు ఖర్చు చేశాడు.

విషయం తెలసుకొని ఎయిర్ ఫోర్స్ అధికారులు అతనని అభినందించడంతోపాటు... అతని ప్లేన్ కి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios