తన మూడేళ్ళ కూతురికి ఏదో అరుదైన జబ్బు ఉందని అనుమానించిన తల్లి ఆమెకు విపరీతమైన మెడికల్ టెస్టులు చేయించింది. ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
టెక్సాస్ : ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారి మీద అవసరంలేని మెడికల్ టెస్టులు చేసి మెడికల్ చైల్డ్ అబ్యూజ్ కి పాల్పడింది. జెస్సికా గాసర్ (27) టెక్సాస్ కు చెందిన మహిళ. మూడేళ్ల చిన్నారికి తల్లి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెపై ముంచౌసెన్ సిండ్రోమ్ బై ప్రాక్సీ కింద ఆరోపణలు వచ్చాయి, దీనినే మెడికల్ చైల్డ్ అబ్యూజ్ అని కూడా పిలుస్తారు.
టెక్సాస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, కోర్టు పత్రాల ప్రకారం, గాసర్ తన 3 ఏళ్ల కుమార్తెకు అరుదైన అనారోగ్యాలున్నాయని నకిలీ సమాచారంతో "అనవసరమైన వైద్య ప్రక్రియ" చేయించిందని ఆరోపణలు వచ్చాయి. టారెంట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో దీనిగురించి రాస్తూ.. జెస్సికా గాసర్ గత వారం అరెస్టయ్యిందని తెలిపింది. ఆమె తన పసిబిడ్డను వైద్యపరంగా దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి.
Boat Accident: నీట మునిగిన పడవ.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు
ఆమెతో పరిచయం ఉన్న వారు ఈ విషయం తెలిస్తే తమను సంప్రదించాలని కోరింది. గాసర్ కేసు ముంచౌసెన్ సిండ్రోమ్ బై ప్రాక్సీకి ఉదాహరణ అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది. తన 3 ఏళ్ల చిన్నారికి అనేక అనవసరమైన మెడికల్ టెస్టులు నిర్వహించిందని షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ఆమె ఇలా ఎంతకాలంనుంచి చేస్తుందో తెలియదని వారు పేర్కొన్నారు.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, ముంచౌసెన్ సిండ్రోమ్ బై ప్రాక్సీ అనేది ఒక మానసిక అనారోగ్యం, దీనిలో వ్యక్తి నిజంగా అనారోగ్యంతో లేనప్పుడు అతను లేదా ఆమె శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి శారీరక లేదా మానసిక అనారోగ్యం ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. చిన్నారికి టెస్టులు చేసే సమయంలో గాసర్ తన స్నేహితులు, పరిచయస్తులకు ప్రైవేట్ సందేశాలు పంపింది.
తన చిన్నారి ఆరోగ్యం గురించి ఫేస్‌బుక్‌లోని అన్ని పోస్ట్‌లను తొలగిస్తానని అందులో పేర్కొంది. అందుకే పోలీసులు... "ఇమెయిల్ లేదా టెక్స్ట్ ద్వారా సోషల్ మీడియాలో జెస్సికా గాసర్‌తో పరిచయం కలిగి ఉంటే, దయచేసి డిటెక్టివ్ మైఖేల్ వెబర్‌ను సంప్రదించండి" అని తమ పోస్టులో పేర్కొంది. పోలీసులు గత వారం రస్క్ కౌంటీలో గాసర్‌ను అరెస్టు చేశారు. టారెంట్ కౌంటీ జైలులో ఉంచారు.