Dhaka: ఆక్సిజన్ ప్లాంట్ లో సంభవించిన భారీ పేలుడు కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఆగ్నేయ బంగ్లాదేశ్ లోని ఆక్సిజన్ ప్లాంట్ లో శనివారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారనీ, మరణాలు పెరిగే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.
6 Killed In Oxygen Plant Explosion: ఆక్సిజన్ ప్లాంట్ లో సంభవించిన భారీ పేలుడు కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఆగ్నేయ బంగ్లాదేశ్ లోని ఆక్సిజన్ ప్లాంట్ లో శనివారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారనీ, మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఆగ్నేయ బంగ్లాదేశ్ లోని ఆక్సిజన్ ప్లాంట్ లో శనివారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఆగ్నేయ ఓడరేవు నగరమైన చిట్టగాంగ్ కు 40 కిలోమీటర్ల దూరంలోని సీతాకుందలోని ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీంలు అక్కడి చేరుకున్నాయి.
కాగా, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆరు మృతదేహాలను వెలికితీశామనీ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక ప్రభుత్వ అధికారి షహదత్ హుస్సేన్ తెలిపినట్టు రాయిటర్స్ నివేదించింది. పేలుడు కారణంగా రెండు కిలోమీటర్ల పరిధి ఉన్న ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని పోలీసు అధికారి నయహనుల్ బారీ తెలిపారు.
ఈ ప్రమాదం గురించి అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. సీతాకుందలోని కేశబ్‌పూర్ ప్రాంతంలో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ ప్లాంట్‌లో పేలుడు సంభవించిదని తెలిపారు. భారీ శబ్దంతో క్షణాల్లోనే మంటలు ఎగసిపడటం ప్రజలు చూశారు. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయనీ, ఐదు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాల్సి వచ్చిందని ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఇంతవరకు అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. మృతులను ఇంకా గుర్తించలేదు. అంతకుముందు ఫిబ్రవరిలో, ఢాకాలోని నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
