అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు స్పాట్ డెడ్.. నలుగురికి గాయాలు
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. నలుగురు గాయపడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని పోలీసులు తెలిపారు.

న్యూఢిల్లీ: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శనివారం తెల్లవారుజామున లాస్ ఏంజెల్స్‌లో కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మరణించారు. కాగా, నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. కాలిఫోర్నియాలో ఈ నెలలో ఇది కనీసం ఆరో కాల్పుల ఘటన కావడం గమనార్హం.
లాస్ ఏంజెల్స్ పోలీసు శాఖకు చెందిన ఫ్రాంక్ ప్రెసిడో ఈ ఘటనను ధ్రువీకరించారు. లాస్ ఏంజెల్స్‌లోని బేవెర్లీ క్రెస్ట్ దగ్గర ఉదయం 2.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని వివరించారు. ఈ కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారని వివరించారు. అందులో నలుగురు ఆరు బయట నిలబడి ఉన్నారని, ముగ్గురు మాత్రం ఓ వెహికిల్‌లో ఉన్నారని తెలిపారు.
వారి వ్యక్తిగత వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. వారంతా ఇప్పుడు విషమంగానే ఉన్నట్టు తెలిసింది.
అయితే, కాల్పులు ఎందుకు జరిగాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారనే విషయంపైనా స్పష్టత లేదు.
Also Read: గన్‌తో ఓనర్‌ను కాల్చి చంపిన పెంపుడు కుక్క.. అమెరికాలో ఘటన.. ఎలా జరిగిందంటే?
గత వారం లాస్ ఏంజెల్స్‌లోని ఓ డ్యాన్స్ హాల్‌లో కాల్పులు జరిగాయి. అప్పుడు 11 మంది మరణించగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
కాలిఫోర్నియాలో అమెరికా లోని కఠిన ఆయుధ చట్టాలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. కానీ, ఇక్కడ కూడా కాల్పుల ఘటనలు ఎక్కువ గా చోటు చేసుకోవడం కలకలం రేపుతున్నది.