బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ప్రధానిగా ఎన్నిక కావడంతో మార్కెట్లలో సానుకూల థృక్ఫథం నెలకొంది.ఆర్ధిక వ్యవస్థను సునాక్ గాడిన పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగు దశాబ్ధాల గరిష్టానికి ద్రవ్యోల్భణం చేరుకుంది.
లండన్: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక కావడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ ను రిషి సునాక్ గట్టెక్కిస్తారని యూకే ప్రజలు విశ్వసిస్తున్నారు. రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికయ్యారని వార్తలు రావడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది.
యూకేలో నాలుగు దశాబ్దాల గరిష్టానికి ద్రవ్యోల్బణం చేరుకుంది. వడ్డీ రేట్లు పెరగడం యూకే ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. యూకే ఆర్ధికమంత్రిగా పనిచేసిన రిషి సునాక్ ప్రధానిగా ఎన్నిక కావడంతో ఆర్ధిక వ్యవస్థ కదుటపడే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుతానని కూడా సునాక్ కూడ ప్రకటించారు.దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 23న లిజ్ ట్రస్ తీసుకున్న వివాదాస్పద పన్ను తగ్గింపులను ఆవిష్కరించడానికి ముందు అంచనాలతో పోలిస్తే వచ్చే ఏడాది స్థూల దేశీయ ఉత్పత్తి రెండు శాతం తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది సెప్టెంబర్ ప్రారంభంలో అంచనా వేసిన వృధ్ది 0.5 శాతం వృద్దితో పోలిస్తే 2023లో ఆర్ధిక వ్యవస్థను 1.4 శాతం సంకోచానికి దారి తీసే అవకాశం ఉందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.యూకే క్రెడిట్ స్కోర్ ఔట్ లుక్ ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రతికూలంగా సవరించింది.
లిజ్ ట్రస్ తీసుకున్న ,యూ టర్న్ నిర్ణయాలు ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపాయనే విమర్శలు లేకపోలేదు. పెరుగుతున్న ఇంధన ధరలపై పరిమితిని గణనీయంగా తగ్గించడంతో పాటు ఇతర కారణాలతో పౌండ్ విలువ పడిపోయింది.అక్టోబర్ లో బ్రిటన్ ఆర్ధిక మాంధ్యం మరింత దిగజారింది. ఈ మేరకు ప్రైవేట్ రంగ ఉత్పత్తి 21 నెలల కనిష్టస్థాయికి పడిపోయిందని తాజా డేటా తెలుపుతుంది.
alsoread:మోర్టాంట్ నామినేషన్ విత్‌డ్రా:బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్
కేవలంమ 44 రోజుల పాటు అత్యున్నత పదవిలో లిజ్ ట్రస్ కొనసాగారు. గత గురువారంనాడు లిజ్ ట్రస్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.సెప్టెంబర్ 6న ఆమె బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిజ్ ట్రస్ ప్రధాని పదవికి పోటీ చేశారు.