సారాంశం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు జ్యుడిషీయల్ రిమాండ్ ను మే 1వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు జ్యుడిషీయల్ రిమాండ్ ను ఈ ఏడాది మే 1వ తేదీ వరకు పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు ఈడీ, సీబీఐ కేసుల్లో జ్యుడిషీయల్ రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం మనీష్ సిసోడియాను పోలీసులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ రిమాండ్ ను పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఈ ఏడాది మార్చి మాసంలో అరెస్ట్ చేశారు. మరో వైపు ఈడీ అధికారులు కూడా మనీష్ సిసోడియాసై కేసులు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ కావడంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరుంది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యారు.