Manila: సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలోనే సునామీ సంభవించే అవకాశాలను యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రస్తావించింది. కాగా, ఫిలిప్పీన్స్ పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న లోపాల వలయం, అంటే ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఒకటి.
Earthquake in the Philippines: ఫిలిప్పీన్స్ ను మరోసారి భూకంపం కుదిపేసింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలోనే సునామీ సంభవించే అవకాశాలను యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రస్తావించింది. కాగా, ఫిలిప్పీన్స్ పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న లోపాల వలయం, అంటే ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఒకటి.
వివరాల్లోకెళ్తే.. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో గురువారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2:00 గంటల తర్వాత (1800 జీఎంటీ) ఆర్కిపెలాజిక్ దేశం మధ్యలో ఉన్న మాస్బేట్ ద్వీప ప్రావిన్స్ లోతైన భూకంపం సంభవించిందని జియోలాజికల్ సర్వే పేర్కొంది. సమీప గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించిన సమాచారం ఇంకా అందలేదు. అయితే, ప్రస్తుతం పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భూకంపం కారణంగా సునామీ సంభవించే అవకాశముందని పేర్కొంది. అయితే, సునామీ హెచ్చరికల గురించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు.
కాగా, ఫిలిప్పీన్స్ పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న లోపాల వలయం, అంటే ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ భూకంపాలతో పాటు భారీ వర్షలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు అధికంగా సంభవిస్తుంటాయి. ఈ దేశం ప్రతి సంవత్సరం దాదాపు 20 టైఫూన్లు, ఉష్ణమండల తుఫానులను ఎదుర్కొంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విపత్తు-పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది. నెల ప్రారంభంలో, ఆగ్నేయ ఫిలిప్పీన్స్‌లోని పర్వత ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
గతేడాది అక్టోబర్ 25న కూడా ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్‌కు ఆగ్నేయంగా ఉన్న పినిలికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించినట్టు అమెరికన్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. అదే రోజు ఉత్తర ఫిల్ప్పీన్స్‌లో అర్థరాత్రి భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం..6.4 తీవ్రతతో భూకంపం లుజోన్ ద్వీపంలోని డోలోరెస్ నుండి 11 కిలోమీటర్లు (7 మైళ్ళు) దూరంలో ఉపరితలానికి 16.2 కిలోమీటర్లు (10 మైళ్ళు) లో భూకంపం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అయితే ఎటువంటి తీవ్రమైన నష్టం జరగలేదు.
అయితే, 1990లో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 2,000 మంది మరణించారు. 1976 ఆగస్టు 16న మిండనావోలో 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర సెలెబెస్ సముద్రంలో మోరో గల్ఫ్ సరిహద్దులో ఉన్న మిండనావో ద్వీపంలోని 700 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని భూకంపం తాకింది. 5,000 - 8,000 మంది మరణించారని అంచనా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కువ మంది నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో సునామీ రావడంతో ఈ ఘటనలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.
