Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ లైవ్ లో మాజీ భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త.. మరణశిక్ష విధించిన కోర్టు..

మాజీ భార్య లైవ్ స్ట్రీమింగ్ లో ఉండగా నిప్పు అంటించి  చంపిన వ్యక్తికి చైనా కోర్టు మరణ శిక్ష విధించింది.  నిందితుడు  టాంగ్ లు ఉద్దేశపూర్వకంగానే ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించిన సిచువాన్ ప్రావిన్స్  అబా ప్రాంతంలోని ఇంటర్మీడియట్  ప్రజా కోర్టు దోషిగా తేల్చింది.  

Man who set TikToker ex-wife afire during live stream sentenced to death in China
Author
Hyderabad, First Published Oct 16, 2021, 8:59 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బీజింగ్ : మహిళలపై గృహహింస ఎంతలా పెరిగిపోయిందంటే... భార్య ఎంత ఉన్నతస్థితిలో ఉన్నా.. విడాకులు ఇచ్చినా ఈ హింస ఆగడం లేదు. తన మాటే వినాలన్న కోసం, తనను నిరాకరించిందన్న కసి మహిళలకు శాపంగా మారుతుంది. నిరుడు ఇలాంటి ఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. తను విడాకులు ఇచ్చి, మళ్లీ తనను పెళ్లి చేసుకోమంటో నిరాకరించందని కక్ష పెంచుకున్న మాజీ భర్త.. వ్లాగర్ అయిన తన భార్యకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 

మాజీ భార్య లైవ్ స్ట్రీమింగ్ లో ఉండగా నిప్పు అంటించి  చంపిన వ్యక్తికి చైనా కోర్టు మరణ శిక్ష విధించింది.  నిందితుడు  టాంగ్ లు ఉద్దేశపూర్వకంగానే ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించిన సిచువాన్ ప్రావిన్స్  అబా ప్రాంతంలోని ఇంటర్మీడియట్  ప్రజా కోర్టు దోషిగా తేల్చింది.  అతడు చేసిన నేరం ‘చాలా క్రూరమైనది’ గా పేర్కొన్న కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.

టాంగ్ మాజీ భార్య armature (30) టిబెటిన్ వ్లాగర్. ‘లాము’  పేరుతో చైనా tik tok వెర్షన్ ‘డౌయిన్’ లో  లో వీడియోలు చేస్తూ ఉంటుంది.  ఆమెకు 7.70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.  నిత్యం అద్భుతమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.  గ్రామీణ ప్రాంతంలోని జీవన విధానం,  కొండలు వంటి వీడియోలతో పాటు  వంటలు,  కుటుంబ సభ్యులతో గడుపుతున్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

చర్చిలో బ్రిటన్ ఎంపీ దారుణ హత్య.. కత్తితో పొడిచి, పొడిచి చంపిన నిందితుడు..!

మేకప్ లేకుండా వీడియోలు చేస్తుండడంతో పాటు ఒక్క సారి సంప్రదాయ దుస్తులు ధరించి వీడియోలు చేస్తుండటంపై ఆమెపై ప్రశంసలు కురిసేవి.  అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమచు  2009లో టాంగ్ ను పెళ్లి చేసుకుంది.  అయితే, తే.గీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా తరచూ గొడవలు జరిగేవి.  టాంగ్ పలుమార్లు చేయి కూడా చేసుకున్నాడు. ఇద్దరి మధ్య పొసగక పోవడంతో జూన్ ట్వంటీ20లో విడాకులు తీసుకున్నారు.  

ఆ తర్వాత మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని కోరినప్పటికీ ఆమె నిరాకరించింది.  14 సెప్టెంబర్ 2020 రాత్రి పదిన్నర గంటల సమయంలో  టాంగ్ లాము  తండ్రి ఇంటికి వెళ్ళాడు.  అక్కడ లాము తన ఫాలోవర్ ల తో live streaming లో మాట్లాడుతుంది. ఆమెపై ఒక్కసారిగా టాంగ్ కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. ఆ తరువాత అక్కడినుంచి పరారయ్యాడు. ఇదంతా లైవ్ లో ఫాలోవర్స్ చూశారు.

90 శాతం గాయాలైన లాము చికిత్స పొందుతూ రెండువారాల తర్వాత మరణించింది. లాము కు నిప్పు పెట్టి పారిపోయిన టాంగ్ ను  ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.  ఆ ఘటనలో లాము తండ్రి ఇల్లు కూడా పూర్తిగా కాలి బూడిద అయింది. ఈ ఘటన తర్వాత దేశంలోని మహిళలపై గృహహింస  పెచ్చుమీరుతుందంటూ ఆందోళన వెల్లువెత్తాయి.

టాంకు death penalty విధించాలి అంటూ.. లామును ఫాలో అయిన లక్షలాది మంది ఫాలోవర్లు డిమాండ్ చేశారు. లాము China Social Media వీబో హోరెత్తిపోయింది. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు టాంగ్ దోషిగా తేల్చిన మరణశిక్ష విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios