Asianet News TeluguAsianet News Telugu

మూడంగుళాల ఎత్తు కోసం.. రూ. 55 లక్షల ఖర్చు.. ! చివరికి....

ఉన్నదానితో సంతృప్తి ఉండనివాళ్లు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. రంగు, రూపు, ఎత్తు విషయంలో ఇది తరచుగా కనిపిస్తుంటుంది. అలాంటిదే ఓ సంఘటన అమెరికాలో జరిగింది. మూడంగుళాల ఎత్తు పెరగడం కోసం ఓ వ్యక్తి ఏకంగా 55 లక్షలు ఖర్చు పెట్టి సాధించాడు. అదృష్టం కొద్ది అతని కల నెరవేరింది. విజయవంతంగా మూడంగుళాల ఎత్తు పెరిగాడు. 

Man undergoes cosmetic limb lengthening surgery increase height in USA - bsb
Author
Hyderabad, First Published Jan 21, 2021, 9:54 AM IST

ఉన్నదానితో సంతృప్తి ఉండనివాళ్లు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. రంగు, రూపు, ఎత్తు విషయంలో ఇది తరచుగా కనిపిస్తుంటుంది. అలాంటిదే ఓ సంఘటన అమెరికాలో జరిగింది. మూడంగుళాల ఎత్తు పెరగడం కోసం ఓ వ్యక్తి ఏకంగా 55 లక్షలు ఖర్చు పెట్టి సాధించాడు. అదృష్టం కొద్ది అతని కల నెరవేరింది. విజయవంతంగా మూడంగుళాల ఎత్తు పెరిగాడు. 

అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్‌ అనే  28 ఏళ్ల వ్యకి ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అయితే ఉన్న ఎత్తుతో అతడు సంతృప్తి పడలేదు. మరింత ఎత్తు పెరగాలనుకున్నాడు. ఇందుకోసం లాస్‌వెగాస్‌లోని డాక్టర్‌ కెవిన్‌ డెబీపర్షద్‌ను సంప్రదించాడు. ఆయన అతడకి ‘లింబ్‌ లెంథ‌నింగ్‌’ కాస్మటిక్‌ సర్జరీని చేయించుకోవాల్సిందా సూచించారు.

ఆల్ఫోన్సో ఇందుకు అంగీకరించాడు. ఆపరేషన్‌ పూర్తయింది. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతకు ముందు కంటే మూడు అంగుళాల ఎత్తు పెరిగాడు. ఐదు అడుగుల 11 అంగుళాలు ఉన్న అతడు ఆరు అడుగుల 1 అంగుళానికి చేరుకున్నాడు. 

గత ఆగస్టులో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతడు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌కు గురికాకుండా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇలాంటి కాస్మటిక్‌ సర్జరీలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్‌ను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2016లో హైదరాబాద్‌కు చెందిన నిఖిల్‌ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరగటానికి సర్జరీ చేయించుకుని తీవ్ర ఇ‍బ్బందుల పాలైన సంగతి తెలిసిందే.
 
Follow Us:
Download App:
  • android
  • ios