Asianet News TeluguAsianet News Telugu

‘దొంగ’తెలివి.. ఉబర్ కాబ్ లో వచ్చి. బ్యాంకు దోచేసి.. మళ్లీ అదే క్యాబ్ లో వెళ్లి...

అమెరికాలో ఓ దొంగ వింత తెలివి ప్రదర్శించారు. ఎంచక్కా ఉబర్ కాబ్ బుక్ చేసుకుని వచ్చి దొంగతనం చేసి.. మళ్లీ అదే క్యాబ్ లో పారిపోయాడు. 

Man Takes Uber To Rob Bank, Makes Driver Wait Outside In US
Author
First Published Nov 22, 2022, 10:08 AM IST

మిషిగాన్ : అమెరికాలోని మిచిగాన్ లో ఓ దొంగ.. బ్యాంకు దోచుకోవడానికి తన తెలివి తేటలను బాగా వాడాడు. కొత్తగా ఆలోచించాడు. మామూలుగా అందరు దొంగలు చేసేలా చేయకుండా సమ్ థింగ్ డిఫరెంట్ అంటూ దొంగతనానికి క్యాబ్ ను ఉపయోగించాడు. వివరాల్లోకి వెడితే.. మామూలుగా దొంగతనం చేయడానికి వాడే కార్లు, బైక్ ల లాంటి వాహనాలకు దొంగలు ముందుగానే నెంబర్ ప్లేట్లు మారుస్తారు. దొంగ నెంబర్లు అతికిస్తారు. దొరకకుండా ఉండడానికి బ్లాక్ పెయింట్ వేయడం, మాస్కులు కట్టడం ఇలా చిత్ర, విచిత్రాలు కూడా చేస్తారు. 

అయితే, అమెరికాలో బ్యాంకును లూటీ చేయడానికి స్కెచ్ వేసిన ఓ దొంగ మాత్రం.. వార్నీ అనిపించే ప్లాన్ వేశాడు. దుండగుడు బ్యాంకు దోపిడీ చేసేందుకు ఎంచుకున్న ప్లాన్ విన్నవారిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. దొంగతనానికి వెళ్లాలనుకున్న బ్యాంకు వరకు ఉబర్ యాప్ లో కారును బుక్ చేసుకున్నాడు. ఆ తరువాత బ్యాంకు వరకు వెళ్లాడు. ఆ తరువాత కారును వెయిటింగ్ లో పెట్టి, అక్కడే ఉండాలని డ్రైవర్ కు చెప్పాడు. ముఖానికి మాస్క్ పెట్టుకుని బ్యాంకులోపలికి వెళ్లాడు. 

ఆ తరువాత బ్యాంకు దోపిడీ పని పూర్తి చేసుకుని నింపాదిగా.. బ్యాగుతో బైటికి వచ్చాడు. అప్పటికే వెయిటింగులో ఉన్న అదే క్యాబ్ లో ఎక్కేసి ఠీవీగా వెళ్ళిపోయాడు. ఈ దోపిడీకి  సంబంధించిన వివరాలను సౌత్ ఫీల్డ్ పోలీసు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం.. జేసన్ క్రిస్టమస్ అనే వ్యక్తి అమెరికాలోని మిషిగాన్ లో ఉంటాడు. అతనుసౌత్ ఫీల్డ్ లోనే హంటింగ్టన్ బ్యాంకు దోపిడీ చేయాలని ప్రణాళిక వేశాడు.  అయితే దీనిమీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని, తాను పట్టుబడకుండా ఉండాలని.. కొత్తగా ఆలోచించాడు.  అందుకే ఉబర్ యాప్ లో కారు బుక్ చేసుకున్నాడు. హంటింగ్టన్ బ్యాంక్ వద్దకు చేరుకున్నాడు. డ్రైవర్ను వెయిటింగ్ లో పెట్టి...  ముఖానికి మాస్కు పెట్టుకుని లోపలికి వెళ్ళాడు, సెక్యూరిటీ గార్డ్ కి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి, బెదిరించాడు. డబ్బును దోచుకుని, కారు ఎక్కి పారిపోయాడు.

ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఘోర అవమానం.. బహిరంగంగా.. అందరూ చూస్తుండగా ఓ మహిళ..

అయితే, ఇంత జరిగినా.. బ్యాంకు లో జరిగిన తతంగమంతా కార్ డ్రైవర్ కు తెలియలేదు. తన క్యాబ్ లో ఎక్కింది మామూలు కస్మరే అనుకోవడం గమనార్హం. బ్యాంకు దోపిడీ సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి.. అతడు  పారిపోయిన కారు నెంబర్ ప్లేట్ ను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్ ను గుర్తించారు. అతడిని ప్రశ్నించగా... దోపిడీకి సంబంధించి తనకేమి తెలియదని సమాధానం చెప్పాడు. దీంతో.. దోపిడీతో అతడికి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఊబర్ డేటా ఆధారంగా క్రిస్టమస్ అడ్రస్ పట్టుకున్నారు. ఆ తరువాత అతడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios