Asianet News TeluguAsianet News Telugu

ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఘోర అవమానం.. బహిరంగంగా.. అందరూ చూస్తుండగా ఓ మహిళ..   

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ మరోసారి ఘోర అవమానం జరిగింది. ఓ మహిళ అధ్యక్షుడిని బహిరంగంగా.. అందరూ చూస్తుండగా  చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

French President Emmanuel Macron slapped again, video goes viral
Author
First Published Nov 22, 2022, 9:54 AM IST

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ ఘోర అవమానం జరిగింది. ఓ మహిళ అధ్యక్షుడిని బహిరంగంగా.. అందరూ చూస్తుండగా  చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో.. ఆలివ్ గ్రీన్ టీ-షర్ట్ ధరించిన ఒక మహిళ అధ్యక్షుడు మాక్రాన్‌ను చెంపదెబ్బ కొట్టడం చూడవచ్చు. మాక్రాన్ ఎక్కడికో వెళుతుండగా ఆ మహిళ అతడిని చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన జరిగినప్పుడు కొంతమంది మీడియా వ్యక్తులు అక్కడే ఉన్నారు. వారిని కూడా ఈ వీడియో క్లిప్ లో చూడవచ్చు. మాక్రాన్ సెక్యూరిటీ గార్డులు వెంటనే మహిళను లాగి అదుపులోకి తీసుకున్నారని మీడియా నివేదికలు తెలిపాయి.

ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. దాడి చేసిన వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కానీ వారి గుర్తింపు వివరాలను మీడియాకు తెలియజేయలేదు. అధ్యక్షుడు మాక్రాన్‌పై దాడి చేసే ముందు .. ఆ వ్యక్తి కొన్ని సార్లు రాచరికం , తీవ్రవాద వ్యతిరేక కార్యకర్తలతో నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ ఫ్రాన్‌కైస్ అనే రాయలిస్ట్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న వ్యక్తి అని సమాచారం.  ఆ దాడి తర్వాత మాక్రాన్ ప్రజలతో మాట్లాడటం,కరచాలనం చేయడం కొనసాగించాడు.తర్వాత అతను బాగానే ఉన్నాడని స్థానిక మీడియా పేర్కోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ .. ఈ వైరల్ వీడియోను ఉటంకిస్తూ..ఈ వీడియో చాలా పాతదని పేర్కొన్నది. అయితే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను చెప్పుతో కొట్టడం ఇది మొదటిసారి కాదు.  

ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన జరిగింది. గతేడాది జూన్ 8న  ఇలాంటి ఘటనే జరిగింది. సౌత్-ఈస్ట్ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి అధ్యక్షుడు మాక్రాన్‌ను ముఖంపై చెప్పుతో కొట్టాడు. ఆ సంఘటన ఫుటేజీని ఉటంకిస్తూ.. ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్'హెర్మిటేజ్ అనే పట్టణంలో మాక్రాన్ ఒక చిన్న గుంపుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

COVID-19కి సంబంధించిన ఆంక్షల సడలింపు తర్వాత ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఇండస్ట్రీ సభ్యులతో మాట్లాడేందుకు మాక్రాన్ అక్కడ పర్యటించారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత అక్కడ వారి జీవన విధానం ఎలా ఉందో.. సాధారణ స్థితికి తీసుకరావడానికి చేపట్టాల్సిన చర్యలను గురించి స్థానిక ప్రతినిధులతో చర్చించడానికి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో తెల్లటి చొక్కా ధరించిన వ్యక్తి.. మాక్రాన్ ప్రేక్షకుల వైపు నడుస్తుండగా.. చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి 'డౌన్ విత్ మాక్రాన్' అని చెప్పడం వినిపిస్తుంది.ఈ కేసులో దాడి చేసిన వ్యక్తితో సహా ఇద్దరిని అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios