60 ఏళ్ల వృద్ధురాలిపై కర్రతో విచక్షణారహిత దాడి.. 50 సార్లు కొట్టిన దుండగుడు.. వీడియో వైరల్
60 ఏళ్ల పేద వృద్ధురాలిపై ఓ నిరాశ్రయుడు కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు నిమిషాలపాటు ఆగకుండా చితకబాదాడు. నేలపై పడి ఆ వృద్ధురాలు కదలలేని దుస్థితికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ అభ్యంతరకర వీడియో వైరల్ అవుతున్నది. 60 ఏళ్ల వృద్ధురాలిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. కనీసం 50 సార్లయినా కర్రతో బాదాడు. నేలపై పడిపోయిన ఆమె చివరకు కదలలేకపోయింది. ఆ తర్వాత కూడా మళ్లీ ఆమెను తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపుతున్నది.
న్యూయార్క్ పోస్ట్ రిపోర్టు ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కొద్దిగా ముందు ఈ దాడి జరిగింది. ఆ వృద్ధురాలు వెస్ట్ 116 వీధి లెనోక్స్ అవెన్యూ స్టేషన్ వద్ద నడుచుకుంటూ వెళ్లుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె పేద వృద్ధురాలు. దాడి చేసిన వ్యక్తి నిరాశ్రయుడని చెబుతున్నారు.
వారి మధ్య గొడవ ఎలా ప్రారంభమైందో తెలియరాలేదు. వీడియో మొదటి నుంచీ ఈ దాడి జరుగుతూనే ఉండింది. గొడుగు పై ఆ వృద్ధ మహిళపై దాడి చేస్తుండగా.. ఆమె తన చేతి కర్రను అడ్డు పెట్టింది. ఆ దుండగుడు ఆమె చేతి కర్రను తీసుకుని ఆమెపై దాడి చేశాడు. దెబ్బలకు తాళలేక ఆమె కిందపడిపోయింది. అయినా... వదలకుండా చితకబాదాడు. ఆమె తల, కడుపు, చేతులు, కాళ్లు, వీపులోనూ ఆమెపై దాడి చేశాడు. దెబ్బలకు అరుస్తూ ఆమె నిశ్చల స్థితికి చేరిపోయింది. ఆమె చేతి కర్ర కూడా విరిగిపోయింది. దాన్ని అక్కడే పడేసి తన వస్తువులను సర్దుకున్నాడు. అప్పుడు కూడా ఆమెను పలుమార్లు తన్నాడు.
Also Read: మహబూబ్‌నగర్ టికెట్ కోసం సంజీవ్ ముదిరాజ్ ప్రయత్నాలు.. సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ!
ఆ 60 ఏళ్ల వృద్ధురాలికి ఆ నిందితుడు తెలియదని న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్ తీసుకెళ్లారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెప్పింది.