ఓ వ్యక్తి తన సొంత కూతురిని కాల్చి చంపాడు. ఆమెను ఇంట్లోకి చొరబడిన దొంగ అని పొరపాటు‌ పడ్డ అతడు కాల్పులు జరిపాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని ఓహియోలో (Ohio) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు గురువారం వెల్లడించారు. 

ఓ వ్యక్తి తన సొంత కూతురిని కాల్చి చంపాడు. ఆమెను ఇంట్లోకి చొరబడిన దొంగ అని పొరపాటు‌ పడ్డ అతడు కాల్పులు జరిపాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని ఓహియోలో (Ohio) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు గురువారం వెల్లడించారు. మృతిచెందిన యువతిని జానే హెయిర్‌స్టన్ ( Janae Hairston) గుర్తించిన పోలీసులు.. ఆమె వయసు 16 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతురాలి తల్లి బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అత్యవసర సేవల (emergency services) విభాగానికి ఫోన్ చేసి తన కూతురు గ్యారేజ్‌లో నేలపై పడి ఉందని తెలిపింది. 

దీంతో ఎమర్జెన్సీ రెస్పాండ్ టీమ్ కొన్ని నిమిషాలలోనే ఘటన స్థలాని వచ్చారు. వారు వెంటనే హెయిర్‌స్టన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఉదయం 5.42 గంటలకు ఆమె మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. హెయిర్‌స్టన్‌ను ఇంట్లోకి చొరబడిన దొంగ భావించి ఆమె తండ్రి కాల్చినట్టుగా పోలీసులు తెలిపారు.

ఇక, ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ 911‌కు కాల్ చేసిన సమయంలో హెయి‌ర్‌స్టన్ తల్లి మాట్లాడిన రికార్డింగ్‌ను పలు స్థానిక మీడియా సంస్థలు ప్రచురించాయి. తమ కుమార్తెను తన భర్త అనుకోకుండా కాల్చివేశాడని హెయిర్‌స్టన్ తల్లి తెలిపింది. వెంటనే అంబులెన్స్ పంపించాలని కోరింది. ఆ సమయంలో యువతి తండ్రి శ్వాస తీసుకో బేబీ (Breathe, baby) అని చెప్పిన మాటలు వినిపించాయి. నా కూతురు గ్యారేజ్‌లో పడిపోయింది.. నా భర్తకు ఏమి చేయాలో తోచడం లేదు. ఓహ్ మై గాడ్. నా కూతురు ఛాతీపై కాల్పులు జరిగినట్టుగా భావిస్తున్నాను’ హెయిర్‌స్టన్‌ తల్లి తెలిపంది.

ఇక, తమ కూతురును బతికించాలని యువతి తల్లిదండ్రులు దేవున్ని దీనంగా వేడుకున్నారు. కాల్ చేసిన ఆరు నిమిషాల తర్వాత ఎమర్జెన్సీ టీమ్ అక్కడికి చేరింది. కాల్పులు జరిగిన దాదాపు గంట సేపటికి హెయిర్‌‌స్టెన్ మృతిచెందింది. ఇక, ఈ కేసుకు సంబంధించి అభియోగాలు నమోదు చేయలేదని కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ పేర్కొంది. ఈ కేసును సమీక్ష కోసం ఫ్రాంక్లిన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి పంపడం జరిగిందని తెలిపింది.