లూథియానా: కరోనా వైరస్ సోకిందనే భయంతో ఓ వ్యక్తి తన భార్యను బాత్రూంలో పెట్టి తాళమేశాడు. ఈ సంఘటన లూథియానాలో జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను విడిపించారు. తనకు వైరస్ సోకి ఉండవచ్చునని మహిళ చెప్పడంతో భర్త, ఆమె ఇద్దరు కుమారులు ఆమెను బాత్రూంలో నిర్బంధించారని పోలీసులు చెప్పారు. 

విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తితో తాను మాట్లాడానని, దాంతో తనకు వైరస్ సోకి ఉండవచ్చునని ఆమె భర్తతో చెప్పింది. దాంతో ఆమెను బాత్రూంలో పెట్టి తాళమేశారు. 

Also Read: తెలంగాణలో పెరుగుతున్న కరోనా అనుమానితులు: కార్పోరేట్ ఆసుపత్రుల సంచలన నిర్ణయం

పోలీసులు వచ్చారని, హింస ఏదీ జరగలేదని, ఫిర్యాదు కూడా చేయలేదని, దాంతో అంబులెన్స్ ను రప్పించి ఆమెను ఆస్పత్రికి తరలించారని అంటున్నారు. 

అయితే, ఆమెకు కరోనా వైరస్ లేదని పరీక్షల్లో తేలింది. లుథియానాలో దాదాపు 28 లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి 100 దాటినట్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.

Also Read: రోజుల తరబడి కాదు.. ఇక కరోనాను క్షణాల్లో కనిపెట్టేయొచ్చు