థాయ్‌లాండ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తనను న్యూఇయర్ వేడుకలకు ఆహ్వానించలేదనే అక్కసుతో ఓ వ్యక్తి తన కుటుంబాన్ని కాల్చేశాడు. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన సుచీప్ సార్సంగ్, అతని భార్య మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఆమె తల్లిదండ్రులు సుచీప్‌ను పిలవకుండా అతని భార్యను మాత్రమే పిలిచారు. ‘‘నన్ను పిలవలేదు కాబట్టి.. నువ్వూ వెళ్లొద్దు’’ అన్నారు. అప్పటికే భర్తతో సఖ్యత లేని ఆమె వెంటనే పిల్లలను తీసుకుని వేడుకలకు వెళ్లింది.

దీనిని జీర్ణించుకోలేని సుచీప్ వెంటనే తుపాకీ తీసుకుని వేడుకల వద్దకు వెళ్లాడు. అప్పటికే చేతిలో మందు గ్లాస్‌తో, డీజే సౌండ్‌కు ఉత్సాహంతో డ్యాన్స్ వేస్తోన్న భార్యను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలపైనా తూటాల వర్షం కురిపించాడు.

వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురిపై కాల్పులు జరపడంతో వారు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పైశాచిక ఆనందాన్ని పొందిన తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుచీప్‌ను ఆసుపత్రికి తరలించారు. ఉత్సాహభరితంగా ఉన్న వాతావరణం కొద్దిసేపటికే అరుపులు, కేకలతో భీతావహంగా మారాయి.