పూల్ గేమ్‌లో రెండు సార్లు ఓడిపోయినందుకు తనను చూసి నవ్వారని.. ఏడుగురిని వరుసపెట్టి కాల్చి చంపాడో నిందితుడు. అతనికి సహకరించాడు మరో స్నేహితుడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. 

బ్రెజిల్‌ : బ్రెజిల్‌లోని పూల్ హాల్‌లో ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపి ఏడుగురిని చంపేశారు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీలో నమోదయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ భయంకరమైన వీడియో బ్రెజిల్ లో వెలుగు చూసింది. 12 ఏళ్ల బాలికతో సహా ఆ ఏడుగురు వ్యక్తులు పూల్ గేమ్‌లో ఇద్దరు వ్యక్తులను చూసి నవ్వారని అవుట్‌లెట్ తెలిపింది. ఈ సంఘటన బ్రెజిల్ రాష్ట్రంలోని మాటో గ్రాసోలోని సినోప్ సిటీలో మంగళవారం జరిగింది. ఈ ఇద్దరు వరుసగా రెండు గేమ్‌లలో ఓడిపోయారు. అది చూసి వారు నవ్వారని ఈ దురాగతానికి ఒడిట్టారు. 

వారిద్దరూ పరారీలో ఉన్నారు. ఆ ఇద్దరు ముష్కరుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఒలివెరా అనే వ్యక్తి ఒక పూల్ గేమ్‌లో ఓడిపోయాడు. 4,000 రీయిస్‌తో ఈ గేమ్ ఓడిపోయాడు. అయితే, ఓటమిని అంగీకరించలేక పౌరుషంతో అదే వ్యక్తితో మళ్లీ పందెం కాశాడు. అయితే రెండోసారి కూడా ఓడిపోయాడు. దీంతో అక్కడున్న కొందరు అది చూసి నవ్వారు. అది అతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఒలివెరా అతని స్నేహితుడు కోపోద్రిక్తులయ్యారు. 

ఏడు అడుగుల పురుషాంగం డ్రెస్ ధరించి మహిళలను వేధిస్తున్న నిందితుడు.. అరెస్టు చేసిన బ్రెజిల్ పోలీసులు

తమను చూసి నవ్వినవారికి పాఠం నేర్పాలనుకున్నారు. అంతే తమ పికప్ ట్రక్ నుండి షాట్‌గన్‌ని తీసుకున్నాడు, ఎజెక్వియాస్ అనే అతని స్నేహితుడు పిస్టల్‌ తీసుకుని.. అక్కడున్న వారిని బెదిరించి.. వరుసగా నిలబెట్టాడు. ఆ తరువాత ఒలివెరా వారి మీద కాల్పులు జరిపాడు. ఒలివెరా (30) జరిపిన కాల్పుల్లో... పూల్ యజమానితో సహా ఇతర వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడవ బాధితుడు తీవ్రగాయాలతో ఆ తరువాత ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటన అంతా పూల్ హాల్‌లోని సీసీటీవీలో రికార్డైంది.

పోలీసులు బాధితుల పేర్లను విడుదల చేశారు - లారిస్సా ఫ్రసావో డి అల్మెయిడా, ఒరిస్బెర్టో పెరీరా సౌసా, అడ్రియానో ​​బాల్బినోట్, గెటులియో రోడ్రిగ్స్ ఫ్రసావో జూనియర్, జోస్యు రామోస్ టెనోరియో, పూల్ హాల్ యజమాని మసీల్ బ్రూనో డి ఆండ్రేడ్ కోస్టా. ఏడవ బాధితుడు ఎలిజ్యూ శాంటోస్ డా సిల్వా అని పోలీసులు తెలిపారు.

తాము అక్కడినుంచి తప్పించుకోవడానికి ఓ మహిళను మాత్రం కాల్పులు జరపకుండా వదిలేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్కడినుంచి తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు మొదట ఓ గ్రామీణ ప్రాంతంలో ఆశ్రయం పొందారు. ఆ తరువాత అక్కడినుంచి కూడా పారిపోయారు. ఇప్పటికీ వారు ఇంకా పరారీలోనే ఉన్నారు.