Asianet News TeluguAsianet News Telugu

పెన్షన్ డబ్బుల కోసం తల్లి చనిపోయినా.. శవాన్ని..!

గతేడాది జూన్‌లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్‌ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు.. తల్లి మృతదేహాన్ని ఐక్‌ప్యాక్స్‌లో పెట్టి భద్రపరిచాడు. 

man hide mother death for pension money in Australia
Author
Hyderabad, First Published Sep 11, 2021, 10:05 AM IST

తల్లి చనిపోయి సంవత్సరం గడుస్తున్నా.. అందరికీ ఆమె బతికే ఉందని నమ్మించాడు. ఎందుకోసమో తెలుసా..  తెలుసా..? ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బుల కోసం అతను అలా చేయడం గమనార్హం. తల్లి చనిపోయిందని తెలిస్తే.. తనకు పెన్షన్ డబ్బులు రావని.. అలా అలా జరిగితే తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లి మృతదేహాన్ని మమ్మీగా మార్చాడు. అలా ఏడాది పాటు డెడ్‌బాడీని ఇంట్లోనే పెట్టుకుని కాలం వెళ్లదీయసాగాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

89 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడి(66)తో కలిసి టైరోల్ ప్రాంతంలోని ఇన్స్‌బ్రక్ సమీపంలో నివసిస్తుండేది. వృద్ధురాలికి ప్రతి నెల పెన్షన్‌ వస్తుండేది. ఈ క్రమంలో గతేడాది జూన్‌లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్‌ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు.. తల్లి మృతదేహాన్ని ఐక్‌ప్యాక్స్‌లో పెట్టి భద్రపరిచాడు. 


ఆ తర్వాత తల్లి మృతదేహానికి బ్యాండేజ్‌లు చుట్టి.. రసాయనాలలో ఉంచాడు. బ్యాండేజ్‌లు ఆ ద్రవాలను పీల్చుకుని.. మృతదేహాన్ని మమ్మీలా మార్చాయి. ఆ తర్వాత మమ్మీగా మార్చిన మృతదేహాన్ని ఇంటిలోపల దాచాడు. ఇక అతడి సోదరుడు తరచుగా ఇంటికి వచ్చి తల్లి గురించి ప్రశ్నించేవాడు. దానికి నిందితుడు.. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చాను అని తెలిపేవాడు. ఇలా ఏడాదిగా తల్లి మరణాన్ని దాచి ఆమె పేరు మీద వస్తోన్న పెన్షన్‌ డబ్బులను తీసుకున్నాడు. అలా ఇప్పటి వరకు 60 వేల డాలర్ల(44,05,743 రూపాయలు) పెన్షన్‌ సొమ్మును తీసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios