గర్ల్‌ఫ్రెండ్‌ను సకాలంలో జాబ్ ఇంటర్వ్యూకు అందేలా చేయాలని ఓ వ్యక్తి కారును ర్యాష్‌గా నడిపాడు. పోలీసులు ఆయనను పట్టుకున్నారు. ఆయన ట్రాక్ రికార్డు చూసిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు.  

న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూకు వెళ్లుతున్నది. కానీ, అప్పటికే ఆమె షెడ్యూల్ కొంచెం లేట్ అయింది. ఆ ట్రాఫిక్‌లో ఇంటర్వ్యూ జరుగుతున్న చోటుకు వెళ్లడం అసాధ్యమేమో అనే భయం మొదలైంది. దీంతో ఆమె బాయ్‌ఫ్రెండ్ యాక్షన్‌లోకి దిగాడు. ఆమెను బ్లాక్ మెర్సిడెస్ కారులో కూర్చోబెట్టుకుని ఫాస్ట్‌గా ఇంటర్వ్యూ వెన్యూకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. కారు తీసి జర్నీ ప్రారంభించాడు. కానీ, అనూహ్యంగా పోలీసులు ఆయనను పట్టుకుని అరెస్టు చేశారు.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జెవోన్ పీరి జాక్సన్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను జాబ్ ఇంటర్వ్యూకు సకాలంలో తీసుకెళ్లాలని బ్లాక్ మెర్సిడెస్ కారులో వేగంగా తీసుకెళ్లాడు. కానీ, అధికారులు ఆయనపై కన్నేసి పట్టుకున్నారు.

జాక్సన్ ర్యాష్‌గా డ్రైవింగ్ చేశాడు. ఓ వైట్ పికప్ ట్రక్‌ను ఎదురుగా ఢీకొనేవాడు. కొద్దిలో తప్పిపోయింది. ర్యాష్‌గా వెళ్లుతున్న ఆ కారుపై పోలీసు అధికారుల కన్నుపడింది. వెనుక సీటులో ముగ్గురు పిల్లలతో ప్రయాణిస్తున్న ఆ కారు డ్రైవర్‌ను పామ్ స్ప్రింగ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే 64 కేఎంపీహెచ్ స్పీడ్‌తో వెళ్లే డీగ్రూడ్ రోడ్ దారిలో అంతకు మించిన వేగంతో ఆయన వెళ్లాడు.

Also Read: నా చదువు కోసం దాచిన డబ్బును కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టారు.. తల్లిదండ్రులపై కూతురి న్యాయపరమైన చర్యలు

పోలీసులు వెంటనే ఆయనను ఆపి లైసెన్స్ చూశాడు. దాన్ని అప్పటికే సస్పెండ్ చేశారు. ఇలా అనుమతులకు మించిన స్పీడ్‌తో ప్రయాణించడం జాక్సన్‌కు ఇది తొలిసారేమీ కాదని పోలీసులకు అర్థమైంది. 22 ఏళ్ల జాక్సన్‌ను పోలీసులు అరెస్టు చేసి బ్రెవర్డ్ కౌంటీ జైలుకు పంపారు. ఏప్రిల్ 18న ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది.