Asianet News TeluguAsianet News Telugu

రోడ్డుపై సిగరెట్ పీక వేసినందుకు రూ.55వేల జరిమానా..!

అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి సిగరెట్ పీకను రోడ్డుపై పడేసినందుకు స్ట్రీట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అతడికి రూ.55 వేల జరిమానా విధించారు.

Man Fined Over rs. 55 Thousands For Throwing Cigarette Butt On Road In UK - bsb
Author
First Published Jan 17, 2023, 11:34 AM IST

యూకే : మన దేశంలో రోడ్డ మీద సిగరెట్ పీకలు, చెత్తాచెదారం పడేయడం, ఉమ్మడం లాంటివి చాలా కామన్. కానీ అదే విదేశాల్లో ఇలాంటి వాటికి భారీ జరిమానా ఉంటుంది. వారు పడేయకపోయినా రోడ్డు మీద చెత్త కనబడితే అక్కడి పౌరులు కూడా వాటిని తీసి డస్ట్ బిన్స్ లో వేస్తుంటారు. అలా తమ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో సాయపడుతుంటారు. అయితే దీనికి భిన్నంగా కొంతమంది వ్యవహరించి చిక్కుల్లో పడుతుంటారు. అలాగే చేశాడో బ్రిటిష్ వ్యక్తి.. సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా రోడ్డు మీద పడేశాడు. అది గమనించిన సిటీ కౌన్సిల్ సిబ్బంది అతనికి భారీ జరిమానా విధించారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్రో న్యూస్ ప్రకారం, ఓ బ్రిటిష్ వ్యక్తి బహిరంగ ధూమపానం చేస్తుండగా కౌన్సిల్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అలెక్స్ డేవిస్‌ అనే ఆ వ్యక్తికి  ఫిక్స్‌డ్ పెనాల్టీ నోటీసు ఇచ్చారు. ఆ తరువాత ఆ వ్యక్తి తన సిగరెట్‌ను గ్లౌసెస్టర్‌షైర్‌లోని థార్న్‌బరీ వద్ద 20 మీటర్ల దూరంలో కౌన్సిల్ అధికారుల ముందు రోడ్డుపై పడేశాడు, తరువాత సిగరెట్ పడేసిన ప్రాంతం నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్లాడు. 

అమెరికాలో జాత్యహంకార దాడి.. 18యేళ్ల ఆసియా విద్యార్థిపై కత్తితో దాడి చేసిన మహిళ...

ముందు అతనికి రూ. 15,000 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. అయితే, వీటిని అతను బేఖాతరు చేశాడు. దీంతో ఆ జరిమానాకు సర్‌చార్జ్ ను కలిపి మొత్తం రూ. 55,603తో సహా జరిమానా చెల్లించాలని ఆదేశించబడింది. దీనిమీద సౌత్ గ్లౌసెస్టర్‌షైర్ కౌన్సిల్ పర్యావరణ అమలు క్యాబినెట్ సభ్యుడు, కౌన్సిలర్ రాచెల్ హంట్ మాట్లాడుతూ.. ‘ఈ సిగరెట్ బట్స్ అనేది కనిపించకుండా పేరుకుపోయే చెత్త. మా స్ట్రీట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎదుర్కొనే అత్యంత సాధారణమైన చెత్త.  ఈ వ్యక్తి ఈ చెత్తవేస్తూ పట్టుబడ్డాడు. తానే వేశానని అంగీకరించాడు. కానీ ఫలితంగా జరిమానా చెల్లించడానికి ప్రయత్నించలేదు. కాబట్టి ఈ విషయాన్ని కోర్టు ముందుంచారు" అని చెప్పారు.

"సిగరెట్ పీకలు కుళ్ళిపోవడానికి 18 నెలల నుండి 10 సంవత్సరాల సమయం పడుతుంది" అని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ప్రకారం, సిగరెట్ పీకలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పడేసే వ్యర్థాలు. వీటివల్ల ప్రతి సంవత్సరం సుమారుగా 766.6 మిలియన్ కిలోగ్రాముల విషపూరిత చెత్త పోగవుతుంది. సముద్రపు పర్యావరణ వ్యవస్థలను మైక్రోప్లాస్టిక్స్ లీకేజీలకు గురిచేసేలా బీచ్‌లలో ఇది అత్యంత సాధారణ ప్లాస్టిక్ చెత్తగా చెప్పవచ్చు.

ప్రతి సంవత్సరం, పొగాకు పరిశ్రమ ఆరు ట్రిలియన్ సిగరెట్లను ఉత్పత్తి చేస్తుంది, వీటిని ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ ధూమపానం చేసేవారు వినియోగిస్తున్నారు. ఈ సిగరెట్‌లలో ప్రధానంగా సెల్యులోజ్ అసిటేట్ ఫైబర్స్ అని పిలువబడే మైక్రోప్లాస్టిక్‌లతో కూడిన ఫిల్టర్‌లు ఉంటాయి. సరిగ్గా పారవేసినప్పుడు, సిగరెట్ పీకలను సూర్యరశ్మి, తేమ వంటివి విచ్ఛిన్నం చేస్తాయి. ఇవి మైక్రోప్లాస్టిక్‌లు, భారీ లోహాలు, అనేక ఇతర రసాయనాలను విడుదల చేస్తాయి. దీనివల్ల పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం, సేవలపై ప్రభావం చూపుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios