లోపలికి రాగానే అక్కడ పనిచేసే యువతిని మీ బాస్ ఎక్కడ అని అడిగాడు. ఆమె చెప్పగానే, వెంటనే టీ తాగు అంటూ ఓ నోట్ల కట్ట ఆమెకు విసిరేసి వెళ్లిపోయాడు. అది చూసి అక్కడివారందరూ షాకైపోయారు.

డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరమే. పుట్టిన ప్రతి వ్యక్తి కష్టపడేది డబ్బు కోసమే. ఆ డబ్బుకోసమే శ్రమిస్తూ ఉంటారు. అయితే, కొందరు డబ్బు విలువ తెలుసుకొని బతుకుతూ ఉంటారు. కొందరు మాత్రం డబ్బు ఉందనే పొగరుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి డబ్బు ఉందనే పొగరుతో అతను ప్రవర్తించిన తీరు నెటిజన్లకు విపరీతమైన కోపం తెప్పించింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందుంటే, ఓ ధనవంతుడు ఖరీదైన కారు కొనడానికి షోరూమ్ కి వస్తాడు. ఈ వీడియో దుబాయ్ లో తెరకెక్కించారు. దుబాయ్ షేక్ వేషధారణలో ఉన్న వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి కార్ల షోరూమ్ కి వచ్చాడు. లోపలికి రాగానే అక్కడ పనిచేసే యువతిని మీ బాస్ ఎక్కడ అని అడిగాడు. ఆమె చెప్పగానే, వెంటనే టీ తాగు అంటూ ఓ నోట్ల కట్ట ఆమెకు విసిరేసి వెళ్లిపోయాడు. అది చూసి అక్కడివారందరూ షాకైపోయారు.

Scroll to load tweet…

ఆ తర్వాత కారు దుకాణంలో పనిచేసే చాలా మందికి డబ్బులు పంచేశాడు. అనంతరం తనకు ఖరీదైన కారు చూపించమని అడిగాడు. అతను ఓ కారు చూపిస్తే, అది తన డ్రైవర్ వాడతాడు అంటూ చులకనగా మాట్లాడాడు. ఈ వీడియో వైరల్ గా మారి, చివరకు పోలీసుల దాకా వెళ్లింది.

యూఏఈ చట్టాల ప్రకారం సదరు వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సామాజిక నిబంధనలు, విలువలను గౌరవించకపోవడంపై ఇతడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీరియస్ అయింది. కాగా, ఇతడి నిర్వాకంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. డబ్బు ఉందన్న అహకారంతో.. ఇలా చేయడం చాలా తప్పు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.