Asianet News TeluguAsianet News Telugu

బర్గర్ కోసం రూ. 66 వేలు చెల్లించాడు.. తీరా ఇంటికెళ్లి చూస్తే మైండ్‌బ్లాంక్.. రిఫండ్ కోసం ఎదురుచూపులు

అమెరికాలో ఓ వ్యక్తి బర్గర్ కొనుగోలు చేయడానికి రూ. 66 వేలు చెల్లించాడు. తీరా ఇంటికి వెళ్లిపోయాక మరుసటి రోజు ఈ పొరపాటును గ్రహించాడు. వారిని సంప్రదిస్తే బ్యాంకు వాళ్లను కలవాలని సూచించాడు. కానీ, బ్యాంకు వాళ్లు మాత్రం పొరపాటు జరిగినట్టు వారు అంగీకరించాలని వివరించారు. ఈ రెండు కదురకపోవడంలో నెల రోజులు గడిచినా ఆ డబ్బు రిఫండ్ కాలేదు.
 

man accidentally paid rs 66,000 for burger in america now waits for refund
Author
First Published Feb 7, 2023, 5:50 PM IST

న్యూఢిల్లీ: బర్గర్ చాలా మంది ఫేవరేట్ చాయిస్‌గా ఉంటుంది. ఎలాంటి బడ్జెట్‌లోనైనా అందుబాటులో ఉంటుంది.రకరకాల ఫ్లేవర్‌లతో నోరూరిస్తూ ఎక్కడ కనిపించినా తినేయాలనిపించేలా ఉంటుంది. అదీగాక, దీన్ని మినీ మీల్‌గానో.. ఈవెనింగ్ స్నాక్ గానో లాగించేస్తుంటారు. యూకేకు చెందిన 35 ఏళ్ల టాబి విల్సన్ కూడా రాత్రి 11 తర్వాత ఇంటికి వెళ్లుతున్న దారిలో ఫుడ్ ట్రక్ కనిపించగానే మరోమారు ఆలోచించకుండానే బర్గర్ తినేశాడు. బిల్లు కట్టి ఇంటికెళ్లాడు. తర్వాత తన బ్యాంక్ అకౌంట్ స్టేటస్ చూస్తున్నప్పుడు బర్గర్‌కు తాను చెల్లించాల్సిన దానికంటే చాలా ఎక్కువ పే చేశానని అర్థం చేసుకున్నాడు. బర్గర్ లైట్ మీల్‌గా కాకుండా ఆ బర్గర్ తన జీవితంలోనే ఖరీదైన మీల్‌ అవుతుందని ఊహించుకోలేదు.

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన టాబి విల్సన్ ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో నైట్ ఎంజాయ్ చేశాడు. యార్క్ వెళ్లి నైటౌట్ ఫ్రెండ్స్‌తో గడిపాడు. అనంతరం, ఇంటికి తిరిగి వెళ్లుతూ 666.50 పౌండ్లు (సుమారు రూ. 66,000)లు చెల్లించాడు. రాత్రి 11 గంటలకు ఈఫ్ కెబాబ్ కిచెన్ ఫుడ్ ట్రక్ వద్ద బర్గర్ కొని ఈ మేరకు చెల్లించాడు.

కొన్ని రోజుల తర్వాతే అతను ఈ పొరపాటును గ్రహించాడు. ఓ రోజు తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అందులో పెద్ద మొత్తంలో అమౌంట్ లేకపోవడాన్ని గుర్తించాడు. ‘నేను అసలు ఆల్కహాల్ తాగను. సరే.. మందు తాగి బయట కలియ తిరుగుతూ కెబాబ్‌లు కొనుక్కుని అంతా తప్పు తప్పుగా చేసి ఉంటే అది వేరే. కానీ, నాది ఆ పరిస్థితి కాదే’ అని టాబీ అన్నాడు. 

Also Read: క్లాస్‌మేట్‌ను 114 సార్లు కత్తితో పొడిచి చంపిన మైనర్ బాలుడు.. కోర్టులో నేరాంగీకారం

తన మిత్రులను వెంటనే ఆ ఫుడ్ ట్రక్ వద్దకు వెళ్లి ఎక్కువ అమౌంట్ చెల్లించామని చెప్పాలని ఆయన సూచించాడు. టాబీని ఆయనబ్యాంకు వాళ్లతో మాట్లాడాల్సిందిగా ఆ ఫుడ్ ట్రక్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ అహ్మద్ అబ్దుల్లా సూచించాడు. నెల రోజులు గడిచినా ఆ మేనేజర్‌కు టాబీకి మధ్య సమన్వయం కుదరలేదు. ఇంకా ఆ డబ్బు రిఫండ్ కాలేదు. 

వారిది పెద్ద కంపెనీ అనీ, చాలా రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుందని బ్యాంకు వారికి వివరంగా చెప్పానని, కానీ, వారు అంగీకరించడం లేదని టాబీ అన్నారు. ఔను.. అనుకోకుండా టాబీ ఎక్కువ అమౌంట్ చెల్లించాడని అహ్మద్ అబ్దుల్లా చెబితే చాలు అని బ్యాంకు వాళ్లు చెబుతున్నారని వివరించారు. కానీ, అబ్దుల్లా ఆ పని చేయడం లేదని అన్నారు. ఇది చాలా ఫన్నీగా అనిపించింది. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఫ్రస్ట్రేటింగ్ వ్యవహారంగా మారిందని టాబీ అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios