క్లాస్‌మేట్‌ను 114 సార్లు కత్తితో పొడిచి చంపిన మైనర్ బాలుడు.. కోర్టులో నేరాంగీకారం
అమెరికాలో ఓ మైనర్ బాలుడు తన 14వ యేటా 13 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హతమార్చాడు. తన క్లాస్‌మేట్ అయిన బాలికను 114 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.

న్యూఢిల్లీ: అమెరికాలో మైనర్ బాలుడు అత్యంత క్రూరంగా ఓ హత్య చేశాడు. క్లాస్‌మేట్‌ను కత్తితో 114 సార్లు పొడిచి చంపేశాడు. 2021 సంవత్సరంలో మదర్స్ డే రోజునే 13 ఏళ్ల క్లాస్‌మేట్ ట్రిస్టిన్ బేలీని ఐడెన్ ఫుచీ హతమార్చాడు. డెడ్ బాడీని ఆమె నివాసానికి సమీపంగా ఉండే అడవిలో పడేశాడు. అమెరికాలోని జాక్సన్‌విల్లీలో ఈ ఘటన జరిగింది.
కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఐడెన్ ఫుచీ నేరాన్ని అంగీకరించాడు. ‘ఈ నేరాన్ని అంగీకరిస్తున్నా. బెయిలీ కుటుంబానికి, నా కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నాను’ అని వివరించాడు.
ది న్యూయార్క్ పోస్టు ప్రకారం, ఫుచీ అడల్ట్ అనే అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే, శిక్ష విధించడంలో వారికి ఎలాంటి లీనియెన్సీ ఇవ్వడం లేదని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అయితే, 14 ఏళ్ల వయసులో మైనార్టీ తీరకముందే ఈ హత్య చేసినందున అతడు మరణ శిక్షకు అర్హుడు కాదని వివరించారు.
Also Read: సతీసహగమన దురాచారాన్ని బీజేపీ నేత గొప్పదిగా మాట్లాడారు: ప్రతిపక్షాల ఆరోపణ, లోక్‌సభలో నిరసనలు
ఈ హత్యకు కొన్ని నెలల ముందు నుంచి ఐడెన్ ఫుచీ బహిరంగంగా హింస, హత్యల గురించి ఎక్కువగా మాట్లాడేవాడని అతని మిత్రులు దర్యాప్తు అధికారులకు తెలిపారు. ఆయన ఆగ్రహంలోనే తన క్లాస్‌మేట్‌నే టార్గెట్ గా చేసుకుని చంపేశాడు. ఆయన తరుచూ తెగిపోయిన మనిషి శరీర అవయవాలను బొమ్మలు వేస్తుండేవాడని తెలిపారు. హింసాత్మకంగా హత్య చేయాలని తన మెదడులో ఎప్పుడూ ఎవరో చెబుతున్నట్టు ఫీల్ అయ్యేవాడినని ఐడెన్ ఫుచీ మిత్రులకు తెలిపేవాడని వివరించారు.