చిలీలో ఓ వింత జరిగింది. జీతానికి వందల రెట్లు ఎక్కువ ఓ వ్యక్తికి వచ్చింది. అంతే గప్ చిప్ గా ఆ డబ్బునంతా డ్రా చేసుకుని జాబ్ కి రాజీనామా చేసి మాయమైపోయాడు.
చిలీ : ఇటీవలి కాలంలో అకౌంట్లలో ఎక్కువమొత్తాల్లో డబ్బులు పడడం.. అవి చూసుకుని వినియోగదారులు ఉబ్బితబ్బిబ్బయిపోతుండడం.. చివరికి బ్యాంకులు మళ్లీ ఆ డబ్బులను వాపస్ తీసుకోవడం లాంటి ఘటనలు తరచుగా వింటూనే ఉన్నాం.. మనకూ అలా పడితే బాగుండూ.. అని మనసులో ఏదో మూల ఒక్కసారైనా అనుకుని ఉంటాం. మనకు అలా పడితే.. అవన్నీ డ్రా చేసుకుని కనిపించుకుండా పారిపోతాం.. అని కూడా ఊహల్లో తేలిపోతుంటాం.. అచ్చంగా ఇలాంటి పనే చేశాడు చిలీలో ఓ వ్యక్తి.. ఇంతకీ ఏం జరిగిందంటే...
చిలీలో ఓ వ్యక్తికి మే నెలలో జీతం వచ్చింది. మామూలే కదా అందరికీ వస్తుంది అనుకుంటున్నారా? అతను ప్రతీనెలా అందుకునే జీతంకంటే వందల రెట్లు ఎక్కువ వచ్చింది. అతని అకౌంట్లో తన జీతానికి 286 రెట్లు ఎక్కువ జీతం అనుకోకుండా వచ్చింది. ఆ వ్యక్తి అకౌంట్ లో రూ. 1.42 కోట్లు లేదా 165,398,851 చిలీ పెసోలు పడ్డాయి. అతని జీతం రూ.43వేలు...అది చూసిన ఆ వ్యక్తి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అయితే తమ తప్పు గ్రహించిన సంస్థ ఆ డబ్బును తిరిగి చెల్లించమంది. దీంతో నీరుగారిపోయిన అతను.. ముందు దానికి ఒప్పుకున్నాడు.. కానీ చివరికీ... రాజీనామా చేసి, మొత్తం డబ్బుతో కనిపించకుండా పోయాడు.
చాక్లెట్ ప్లాంట్ లో సాల్మొనెల్లా కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలో ఉత్పత్తి నిలిపివేత...
ఆ వ్యక్తి కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ ఓ ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థలో పనిచేస్తున్నాడు. ఇది చిలీలో కోల్డ్ కట్‌లను ఎక్కువగా ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటి. కంపెనీ ఉద్యోగికి జీతం రూ. 43,000 - 500,000 పెసోలు, అయితే, అనుకోకుండా అతనికి 165,398,851 పెసోలు చెల్లించింది. అతను ఆ డబ్బును డ్రా చేసుకున్నాడు. ఆ తరువాత యాజమాన్యం డబ్బుల లెక్కలో తేడా కొడుతోందని రికార్డులను పరిశీలించగా తప్పును గుర్తించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తప్పును గుర్తించిన వెంటనే సియోల్ లో ఉండే ఆ ఉద్యోగి దగ్గరికి యాజమాన్యం వచ్చింది. తప్పుగా పడి మొత్తాన్ని చెల్లించమని అడిగింది. దీనికి అతను అంగీకరించాడు కూడా. మూడు రోజులు గడుస్తున్నా డబ్బులు జమ కాలేదు. అంతేకాదు, అతను కూడా అందుబాటులో లేకుండా పోయాడు. మూడోరోజు టచ్ లోకి వచ్చాడు. కంపెనీ పొరపాటుగా వేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తున్నట్లు చెప్పాడు. సడెన్ గా జూన్ 2న ఆ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేసి మాయమయ్యాడు. దీంతో షాక్ అవ్వడం కంపెనీ వంతయ్యింది. ఆ డబ్బును, ఉద్యోగిని ఎలా పట్టుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంది. వివిధ ఏజెన్సీలను ఆశ్రయించి.. సదరు ఉద్యోగి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఉద్యోగిపై ఫిర్యాదు కూడా చేసింది.
ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా.. ఉద్యోగి వైపు నుంచి చూస్తూ ఎవరైనా అలాగే చేస్తారు కదా అనిపిస్తుంది.. అలాగే యాజమాన్యం చేసిందీ కరెక్టే అనిపిస్తుంది. అంతా డబ్బు మాయ..
