Kuala Lumpur: మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఒక ప్రయివేటు జెట్ ప్రమాదానికి గురై హైవేపై మోటర్‌బైక్, కారును ఢీకొట్టింది. ఈ విషాద సంఘటనలో జెట్ లో ఉన్న ఎనిమిది మందితో పాటు రోడ్డు పై ప్రయాణిస్తున్న ఇద్దరు వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. బీచ్‌క్రాఫ్ట్ మోడల్ 390 (ప్రీమియర్ 1) విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఎల్మినా టౌన్‌షిప్ సమీపంలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది.
10 killed as plane crashes on Kuala Lumpur: మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఒక ప్రయివేటు జెట్ ప్రమాదానికి గురై హైవేపై మోటర్‌బైక్, కారును ఢీకొట్టింది. ఈ విషాద సంఘటనలో జెట్ లో ఉన్న ఎనిమిది మందితో పాటు రోడ్డు పై ప్రయాణిస్తున్న ఇద్దరు వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. బీచ్‌క్రాఫ్ట్ మోడల్ 390 (ప్రీమియర్ 1) విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఎల్మినా టౌన్‌షిప్ సమీపంలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. పెద్దగా మంటలు చెలరేగడంతో గుర్తుపట్టకుండా కాలిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మలేషియాలోని కౌలాలంపూర్ ఎక్స్ ప్రెస్ వేపై గురువారం చార్టర్ విమానం కూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు దుర్మరణం పాలయ్యారు. లాంగ్కావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి బయలుదేరిన విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని మలేషియా సివిల్ ఏవియేషన్ అథారిటీని ఉటంకిస్తూ సీఎన్ఎన్ నివేదించింది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.51 గంటలకు ప్రమాద స్థలం నుంచి పొగలు వస్తున్నట్లు కంట్రోల్ టవర్ గుర్తించిందనీ, అయితే విమానం నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని తెలిపింది. అయితే, ఈ ప్రమాద ఘటనను అటుగా కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. విమానం ఒక కారును, మోటారు సైకిల్ ను ఢీకొట్టిందని మలేషియా మీడియా సంస్థను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తెలిపింది. ఫోరెన్సిక్ సిబ్బంది అవశేషాలను సేకరించే పనిలో ఉన్నారనీ, పోస్టుమార్టం పరీక్ష, గుర్తింపు ప్రక్రియ కోసం వాటిని క్లాంగ్ లోని తెంగ్కు అంపువాన్ రహీమా ఆసుపత్రికి తీసుకువస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై రవాణా మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతుందని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి తీసిన వీడియోలు, చిత్రాల్లో హైవేలోని కాలిపోయిన భాగం గాలిలో పొగతో చుట్టుముట్టినట్లు కనిపించింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రవాణా శాఖ మంత్రి ఆంథోనీ లోకే మీడియా సమావేశంలో తెలిపారు. బాధితులను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ఫోరెన్సిక్ నిర్ధారణ తీసుకోవాల్సి ఉందన్నారు.
