సింగపూర్ లో ఓ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ ను పదే పదే చిత్రహింసలకు గురిచేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి అక్కడి కోర్టు జైలుశిక్ష విధించింది. 

సింగపూర్ : పార్తిబన్ అనే భారతీయ సంతతికి చెందిన మలేషియన్ కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. పార్తిబన్ తన గర్ల్ ఫ్రెండ్ ని పదే పదే భయభ్రాంతులకు గురి చేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు పార్తిబన్ తన సహోద్యోగురాలితో గత రెండు, మూడు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్ ఎలీషా మాట్లాడుతూ .. అతని ప్రవర్తన తీరు నచ్చక.. ఆమె తన మేనమామతో కలిసి ఉంటుంది. 

దీంతో అతను ఆమెపై పదే పదే భయబ్రాంతులకు గురి చేసేలా దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి, కొట్టడంతో ఆమె మేనమామ కలగజేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా అతను వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెయిల్పై వచ్చి అతడు మళ్ళీ ఆమె మేనమామ ఇంటి వద్దకు వచ్చాడు. అయితే ఆమె నిరాకరించడంతో గేట్ పగులగొట్టి వచ్చి మరి ఆమెను దారుణంగా హింసించి కారులో తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు.

అమ్మమ్మను హత్య చేసిన మనవడు... భారతీయ సంతతి వ్యక్తిపై కేసు..

అయితే ఆమె అక్కడ ఉండే స్థానికుల సహాయం కోరింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో మళ్లీ బెయిల్పై వచ్చి ఈసారి ఏకంగా చంపేందుకు పథకం వేశాడు. ఇందులో భాగంగా తన వస్తువులు తీసుకునేందుకు వచ్చానంటూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి, హింసించడం మొదలుపెట్టాడు. ఇక తట్టుకోలేక ఆమె చచ్చిపోదామనుకుంటుండగా ఇంతలో ఒక పోలీస్ కారు అటువైపుగా వెళ్తుండడంతో ఆమె వారి సహాయం కోరింది.

దీంతో పార్తిబన్ వెంటనే అప్రమత్తమై తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని విచారణలో లో తనపై మోపిన ఆరోపణలు అన్నింటిని అంగీకరించాడని చెప్పారు. ఇలా అతను తన ప్రేయసిని పదేపదే పైశాచికంగా హింసించి, హత్య చేసేందుకు ప్రయత్నించినందుకు ఏడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అయితే బాధితురాలు తరఫు న్యాయవాది ఆమెను గాయపరచి, తీవ్రంగా హింసించినందుకు గాను పార్తిబన్ కు 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కోరడంతో అతనికి 2 నుంచి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.