ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా పదహారున్నరవేల కోట్లు జాక్ పాట్ వచ్చింది. అయితే అతను ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదట. 

అమెరికా : లాటరీ లో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్ బాల్ లాటరీ గేమ్ లో కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. అంటే, మన కరెన్సీలో పదహారున్నరవేల కోట్ల రూపాయలు. అయితే, మొదట అతనికి సంబంధించిన వివరాలు లాటరీ అధికారులు బయటపెట్టలేద .. ఎట్టకేలకూ అతని వివరాలు బయటపెట్టారు. అతని పేరు ఎడ్విన్ కాస్ట్రో అని చెప్పారు. కానీ మిగతా వివరాలేవీ చెప్పలేదు అధికారులు. గత నవంబర్ లో పవర్ బాల్ జాక్ పాట్ అతడిని వరించింది. దీంతో కనీవినీ ఎరుగని లాటరీ ప్రైజ్ మనీ అతడిని వరించింది. 

విజేతల వివరాలను కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. బయటికి చెప్పొచ్చు. కానీ, కొన్ని కండిషన్లు ఉంటాయి. వ్యక్తి పేరు, ఆ టికెట్ కొన్న ప్లేస్ చెప్పొచ్చు.. వీటితో పాటు టికెట్ ఏ రోజు కొన్నది, ఏ రోజు ఫ్రైజ్ మనీ గెల్చుకున్నది.. ఎంత మొత్తం గెల్చుకున్నది లాంటి వివరాలు కూడా చెప్పొచ్చు. కానీ.. అతనికి సంబంధించిన పర్సనల్ విషయాలు అంటే.. అడ్రస్, నేపథ్యం వివరాలు మాత్రం చెప్పడానికి వీలులేదు.

పశ్చిమ పనామాలో రోడ్డు ప్రమాదం: 39 మంది మృతి

ప్రైజ్ మనీ అనౌన్స్ అయ్యాక.. వెంటనే తీసుకోవాల్సిన పనిలేదు. యేడాదిలోపు ప్రైజ్ మనీ తీసుకోవచ్చు. లేదంటే వదిలేయచ్చు. అయితే, కాస్ట్రో అందుకు ఇష్టపడలేదట. ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా తీసుకుంటాడో లేదో తెలియదు. అయితే, తనకు జాక్ పాక్ కొట్టిన సంగతి తెలియగానే భావోద్వేగానికి గురయ్యానని.. అసలు నాకే వచ్చిందా.. నిజమేనా అని షాక్ అయ్యానని ఒక ప్రకటనలో క్యాస్ట్రో తెలిపాడు. 

గతంలో ఓ వ్యక్తి ఇదే పవర్ బాల్ లాటరీ గేమ్ లో 1.6బిలియన్ డాలర్లు గెల్చుకున్నారట. అంటే మన కరెన్సీలో పన్నెండువేల కోట్ల రూపాయలు అన్నమాట. అయితే, విజేత ఆ డబ్బులను తీసుకోలేదట. ఈ సారి కూడా క్యాస్ట్రో ఈ డబ్బులు తీసుకుంటాడో, లేదో చూడాలి. పవర్ బాల్ జాక్ పాట్ లాటరీ గేమ్ అమెరికి సంయుక్త రాష్ట్రాల్లోని 45 రాష్ట్రాల్లో బాగా పాపులర్. 

దీని టికెట్ ధర చాలా తక్కువ. కేవలం 2 డాలర్లు మాత్రమే. అలా చూసుకుంటే లాటరీ గెలుచుకున్నవారు ఎంత లక్కీనో మీకు అర్థం అవుతుంది. ఈ గేమ్ కు ఉన్న మరో రూల్.. ఈ లాటరీ గేమ్ ను 18 యేళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఆడాలి. లక్షల మంది ఆడితే ఎవరో ఒకరికి ఈ ప్రైజ్ మనీ దక్కుతుంది.