Asianet News TeluguAsianet News Telugu

UK: లైంగిక నేరాల‌కు పాల్ప‌డిన మాజీ బ్రిటీష్ పార్లమెంటేరియన్ లార్డ్ నజీర్ అహ్మద్

UK: భార‌త రాజ‌కీయ వ్య‌తిరేకి.. ఖలిస్థాన్‌, జ‌మ్మూకాశ్మీర్ వేర్పాటు వాదానికి అనుకూలంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే.. మాజీ బ్రిటీష్ పార్లమెంటేరియన్ లార్డ్ నజీర్ అహ్మద్‌.. బాల‌ల‌పై లైంగిక నేరాల‌కు పాల్ప‌డ్డాడు. 1970వ దశకంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన కేసులో పాకిస్థాన్ సంతతికి చెందిన ఆయ‌న‌ను బ్రిటీష్ కోర్టు దోషిగా తేల్చింది. 
 

Lord Nazir Ahmed convicted of sexual offences
Author
Hyderabad, First Published Jan 7, 2022, 9:53 AM IST

UK: భార‌త రాజ‌కీయ వ్య‌తిరేకి.. ఖలిస్థాన్‌, జ‌మ్మూకాశ్మీర్ వేర్పాటు వాదానికి అనుకూలంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే.. మాజీ బ్రిటీష్ పార్లమెంటేరియన్ లార్డ్ నజీర్ అహ్మద్‌ను బాల‌ల‌పై లైంగిక నేరాల‌కు పాల్ప‌డ్డాడు. 1970వ దశకంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన కేసులో పాకిస్థాన్ సంతతికి చెందిన ఆయ‌న‌ను బ్రిటీష్ కోర్టు దోషిగా తేల్చింది. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు ఈ కేసులు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది కోర్టు. అయితే, న్యాయ‌స్థాన్ తీర్పును పై కోర్టులో అప్పీల్ చేస్తామ‌ని లార్డ్ న‌జీర్ అహ్మ‌ద్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వెల్ల‌డించారు. బ్రిట‌న్ స్థానిక మీడియా పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. లార్డ్ అహ్మద్ ఒక అబ్బాయిపై తీవ్రమైన లైంగిక వేధింపులు, బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో దోషిగా న్యాయ‌స్థానం నిర్ధారించింది. బ్రిట‌న్ మాజీ పార్ల‌మెంటేరియ‌న్ అయిన ఆయ‌న యుక్తవయసులో ఉన్నప్పుడు యార్క్‌షైర్‌లోని రోథర్‌హామ్‌లో ప‌లు మార్లు ఇలాంటి లైంగిక నేరాల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నించార‌నే కేసును షెఫీల్డ్ క్రౌన్ కోర్టు విచారించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను కోర్టు దోషిగా తేల్చింది. లార్డ్ అహ్మద్‌కు ఎప్పుడు శిక్ష విధించాలనేది న్యాయమూర్తి జస్టిస్ లావెండర్ త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తారు.  

Also Read: Caste: coronavirus: కోటి మందికిపైగా టీనేజ‌ర్ల‌కు టీకాలు.. !

నజీర్ అహ్మద్ 1970ల ప్రారంభంలో బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. స‌ద‌రు బాధితురాలికి 16 లేదా 17 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అలాగే, అంత‌క‌న్న త‌క్కువ ఉన్న వారిపైనా లైంటిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఇదే స‌మ‌యంలో  11 సంవ‌త్స‌రాలున్న ఓ బాలుడిపై కూడా లైంగిక నేరాల‌కు పాల్ప‌డ్డాడు అని ప్రాసిక్యూటర్ టామ్ లిటిల్ కోర్టుకు వెల్ల‌డించారు. లార్డ్ న‌జీర్ అహ్మ‌ద్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. తాను నేరాల‌కు పాల్ప‌డ‌లేద‌ని కోర్టుకు తెలిపారు. త‌న‌పై కావాల‌నే ఈ విధ‌మైన కుట్ర‌కు ప‌న్నార‌ని ఆరోపించారు. త‌న‌కు వ్య‌తిరేకంగా సాక్ష్యాల‌ను సృష్టించార‌ని పేర్కొన్నారు.  అయితే, లార్డ్ న‌జీర్ అహ్మ‌ద్ పాల్ప‌డిన నేరాలు అత్యంత దారుణ‌మైన‌వని ప్రాసిక్యూటర్ టామ్ లిటిల్ కోర్టుకు తెలిపారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ల‌భించిన సాక్ష్యాలు క‌ల్పిత‌మైన‌వి కావ‌ని అన్నారు. 2016 లో ఇద్ద‌రు బాధితుల మ‌ధ్య ఫోన్ రికార్డుల సంభాష‌ణలు ఉన్నాయ‌ని తెలిపారు. బాధితుల వాంగ్మూలాలు సైతం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు.  ఇరువురి వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం లార్డ్ న‌జీర్ అహ్మ‌ద్ ను దోషిగా తెల్చింది.

Also Read: Caste: ప్ర‌ధాని కాన్వాయ్ ని అడ్డుకున్న నిర‌స‌న‌కారులు.. ప్లైఓవ‌ర్‌పై 15నిమిషాల పాటు ప్ర‌ధాని !

కాగా, లార్డ్ న‌జీర్ అహ్మ‌ద్ బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో పీర్‌గా నియమితులైన తొలి ముస్లింగా గుర్తింపు పొందారు. పాక్ ఆక్రమిత జ‌మ్మూకాశ్మీర్‌లో జన్మించిన నజీర్ అహ్మద్ (64) చిన్నతనంలోనే యూకేకు వలస వెళ్లాడు. 1998లో హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు అతని నియామకం బ్రిటిష్ ముస్లిం సమాజానికి ఒక చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొనబడింది. అయితే, ఆయ‌న భార‌త్‌కు వ్య‌తిరేకంగా అనేక సార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. భార‌త వ్య‌తిరేకిగా పేరొందారు. జ‌మ్మూకాశ్మీర్ వేర్పాటు వాదానికి అనుకూలంగా న‌డుచుకున్నారు. ఖ‌లిస్థాన్ ఉద్య‌మానికి అనుకూలంగా అనేక సార్లు మాట్లాడారు. అయితే, అత‌ను చిన్నారుల‌పై లైంగిక నేరాల‌కు పాల్ప‌డ్డాడు అనే ఆరోప‌ణ‌ల‌తో నజీర్ అహ్మద్ 2020 లో బ్రిటన్ హౌస్‌ ఆఫ్ లార్డ్స్‌కు రాజీనామా చేశారు.  అలాగే, త‌న అధికారాల‌ను దుర్వినియోగానికి పాల్ప‌డ్డాడ‌ని కూడా ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఓ  మహిళ నుంచి లైంగిక ప్రయోజనాలను పొందేందుకు తన పదవిని దుర్వినియోగం చేసినట్లు వ‌చ్చిన‌ ఆరోపణలపై కూడా విచార‌ణ‌కు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం దోషిగా తేలిన కేసులో  ఫిబ్రవరి 4న కోర్టుకు ఆయ‌న‌కు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది.

Also Read: Caste: coronavirus: జేజే హాస్పిట‌ల్‌లో 61 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్‌

Follow Us:
Download App:
  • android
  • ios