జింక కి ఆహారం తినిపించిన చిన్నారి.. నెటిజన్లు ఫిదా..!
ఆ తర్వాత జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించి నమస్కరిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి జంతువుకు ఆహారం ఇస్తూ మళ్లీ కృతజ్ఞతగా నమస్కరిస్తుంది
చిన్న పిల్లలు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఓ చిన్నారి తన బుబ్జి బుజ్జి చేతులతో ఓ జింకకు ఆహారం తినిపించింది. దాని కోసం దాని ముందు ఒంగి మరీ ప్రేమగా తినిపించడం విశేసం. ఈ 10 సెకన్ల వీడియో ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ది ఫిగెన్ అనే ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు. కొమ్మలతో కూడిన గంభీరమైన జింక ముందు చిన్నారి గౌరవంగా నమస్కరిస్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించి నమస్కరిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి జంతువుకు ఆహారం ఇస్తూ మళ్లీ కృతజ్ఞతగా నమస్కరిస్తుంది. వారిద్దరికి ఒకరి భాష మరొకరికి తెలుసు అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ జత చేయడం విశేషం.
ఈ వీడియో 816k వ్యూస్, టన్నుల కొద్దీ కామెంట్స్ రావడం విశేషం. ఆ చిన్నారి జింక పట్ల చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఎంత క్యూట్ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరూ ఎంత మంచి స్నేహితుల్లా ఉన్నారు అని మరొకరు, అందం, అమాయకత్వం కలబోసినట్లుగా వీడియో ఉందని మరొకరు కామెంట్ చేయడం విశేషం.