సారాంశం

ఆ బాలుడు అన్న కాబోతున్నాడు అనే విషయాన్ని వాళ్ల అమ్మ చెప్పగా... చాలా ఎమోషనల్ ఫీలయ్యాడు. అతని ఆనందం చూస్తే... ఎవరికైనా ముద్దు వచ్చేస్తుంది.

మనకు సోషల్ మీడియాలో ప్రతిరోజూ  కొన్ని వేల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మాత్రం  మనసును హత్తుకుంటాయి. మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది. తాజాగా నెట్టింట ఓ చిన్న పిల్లాడి వీడియో వైరల్ గా మారింది.  అందులో... ఆ బాలుడు అన్న కాబోతున్నాడు అనే విషయాన్ని వాళ్ల అమ్మ చెప్పగా... చాలా ఎమోషనల్ ఫీలయ్యాడు. అతని ఆనందం చూస్తే... ఎవరికైనా ముద్దు వచ్చేస్తుంది.

 

View post on Instagram
 


ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌హగ్ అనే పేజీలో షేర్ చేశారు. క్లిప్‌లో, ఒక మహిళ గుడ్ న్యూస్ చెప్పడానికి  తన కొడుకును పిలిచింది. ఆమె అతనికి నువ్వు బిగ్ బ్రదర్ కాబోతున్నావు అంటూ చెప్పింది.  అది కూడా... టీ షర్ట్ పై రాసి చూపించడం విశేషం. ఆ టీషర్ట్ చూసిన తర్వాత  ఆ బాలుడి ఆనందం ప్రైస్ లెస్ అని చెప్పొచ్చు.  ఆనందంతో ఆ బాలుడు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. వాళ్ల అమ్మని కౌగిలించుకొని తన ఆనందాన్ని పంచుకున్నాడు. 

క్యాప్షన్ ప్రకారం... బాలుడు గత రెండు సంవత్సరాల నుండి పెద్ద సోదరుడు కావాలని ఎదురుచూస్తున్నాడు. రెండేళ్ళ తర్వాత తన తల్లిదండ్రులు తనకు... ఈ విషయాన్ని చెప్పారని ఆ బాలుడు ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయగా...  52 వేలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. కామెంట్ల వర్షం కురుస్తోంది. క్యూట్ అని కొందరు.. సూపర్ బిగ్ బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.