Asianet News TeluguAsianet News Telugu

మహిళల శృంగారం.. భర్తకు నష్టపరిహారం.. !!

ఇదో విచిత్రమైన స్టోరీ.. మహిళ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. ఆ మహిళలకు అప్పటికే పెళ్లి కావడంతో.. ఆ భర్త కోర్టుకు ఎక్కడం.. కోర్టు సదరు భర్తకు నష్టపరిహారం ఇవ్వాలంటూ అక్రమసంబంధం పెట్టుకున్న మహిళను ఆదేశించడం జరిగిపోయింది. 

Lesbian lover ordered to pay compensation to a man for having a sexual relationship with his wife in japan - bsb
Author
Hyderabad, First Published Mar 25, 2021, 3:48 PM IST

ఇదో విచిత్రమైన స్టోరీ.. మహిళ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. ఆ మహిళలకు అప్పటికే పెళ్లి కావడంతో.. ఆ భర్త కోర్టుకు ఎక్కడం.. కోర్టు సదరు భర్తకు నష్టపరిహారం ఇవ్వాలంటూ అక్రమసంబంధం పెట్టుకున్న మహిళను ఆదేశించడం జరిగిపోయింది. 

కాస్త కన్ ఫ్యూజ్డ్ గా ఉన్న ఈ సంఘటన జపాన్ లో జరిగింది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. జపాన్ కు చెందిన ఓ వ్యక్తి సదరు మహిళ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా శృంగారంలో కూడా పాల్గొన్నదని కేసు పెట్టాడు. అంతేకాదు దీనికి గాను ఆ మహిళ నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా టోక్యో కోర్టును ఆశ్రయించాడు. 

తన భార్యకు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఆన్ లైన్ లో పరిచయం ఏర్పడిందని తెలిపాడు. ఆ తరువాత ఆ పరిచయం కాస్తా వారిద్దరినీ దగ్గర చేసిందని, వీరు ఏకాంతంగా కలుసుకున్నారని.. ఆ సమయంలో శృంగారంలో పాల్గొన్నారని ఆరోపించాడు. 

అయితే అతడి వాదనలు విన్న కోర్టు కూడా అతనికి సపోర్టుగా నిలిచింది. ఆ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు జరిమానా విధించింది. అతడి భార్యతో శృంగారంలో పాల్గొన్నందుకు గానూ అతడికి 1,10,000యెన్లు అంటే భారత కరెన్సీలో 70 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 

అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కోర్టు తీర్పు మీద మాట్లాడుతూ.. అతడి భార్యకు, నాకు మధ్య జరిగింది చట్టరీత్యా నేరం కాదు. దాని వల్ల వారి వైవాహిక జీవితానికి ఎలాంటి నష్టం లేదు... అని అంటోంది. కానీ వైవాహిక జీవితంలో శాంతిని దెబ్బతీసే చర్యల్ని తప్పుగానే భావించాలని, పెళ్లైన యువతితో లైంగిక సంబంధం పెట్టుకుని అశాంతి కలిగించినందుకు జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. 

జపాన్ లో స్వలింగ సంపర్కానికి చట్టారీత్యా ఆమోదం ఉంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్వలింగ సంపర్కాన్ని కోర్టు వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్పు ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

నచ్చిన వ్యక్తులు.. పరస్పర అంగీకారంతో లైంగికంగా కలిస్తే తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఓ కేసు సందర్బంగా టోక్యో హైకోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చింది. తన మహిళా భాగస్వామిని మోసం చేసినందుకు గాను ఆమెకి పరిహారం చెల్లించాల్సిందిగా ఓ మహిళలను ఆదేశించింది. 

ఈ కేసులోని జంట ఏడేళ్లు కలిసి జీవించారు. వీరిద్దరు యుఎస్ లో పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కనడం గురించి చూడా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే భాగస్వామి తనను మోసం చేసిందని మరొక యువతి కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు మహిళా భాగస్వామికి నష్టపరిహారం చెల్లించాలని సదరు మహిళను ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios