సోషల్ మీడియా వేదికలలో నిత్యం  ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే వీక్షకుల దృష్టిని అధికంగా ఆకర్షిస్తుంటాయి.

సోషల్ మీడియా వేదికలలో నిత్యం ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే వీక్షకుల దృష్టిని అధికంగా ఆకర్షిస్తుంటాయి. అందులో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలదే సింహాభాగం. తాజాగా ఓ చిరుతపులిపై దాదాపు 50 బబూన్(కోతులను పోలిన జంతువులు) దాడి చేశాయి. ఐకమత్యంగా ఉండి చిరుతపై ఎదురుదాడికి దిగాయి. దీంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. అలా పారిపోతున్న చిరుతను కూడా కొంతదూరం వరకు బబూన్‌లు వెంబడించాయి. 

Latest Sightings అనే యూట్యూబ్ చానల్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో ప్రకారం.. తొలుత ఓ చిరుత రోడ్డు పక్కన ఒంటరిగా నడుస్తున్నట్టుగా చూపించారు. ఆ తర్వాత రోడ్డు మీదుగా పెద్ద ఎత్తు బబూన్‌లు నిలిచి ఉన్న దృశ్యాన్ని చూపించారు. అయితే కొంతసేపటికే ఓ వైపు నుంచి దూసుకొచ్చిన చిరుతపులి.. బబూన్‌లపై దాడి చేసేందుకు యత్నించింది. అయితే తొలుత బబూన్‌లు భయపడి పరుగులు పెట్టాయి. అయితే అందులో ఒకటి మాత్రం చిరుతను ఎదురించేందుకు ముందుకు వచ్చింది. అది కూడా కొంత వెనకడుగు వేసే సమయంలో మిగిలిన బబూన్‌లు కూడా దానికి జత కలిశాయి. దీంతో బబూన్‌లు అన్ని మూకుమ్మడిగా చిరుతపై దాడికి దిగాయి. 

YouTube video player

అయితే ఎలాగోలా వాటి దాడి నుంచి తప్పించుకున్న బబూన్.. అక్కడి నుంచి చెట్ల పొదల్లోకి వేగంగా పరుగులు తీసింది. అయినప్పటికీ చిరుతను బబూన్‌లు వెంబడించాయి. అయితే ఈ సమయంలో ఆ రోడ్డుపై ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అక్కడ కార్లలో ఉన్నవారు ఈ వీడియోను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.