తుస్సుమన్న రాకెట్.. 60 అడుగుల వరకే ఎగిరింది!

Launch of private Japanese firm's rocket fails
Highlights

తుస్సుమన్న రాకెట్.. 60 అడుగుల వరకే ఎగిరింది!

జపాన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైనంది. రాకెట్‌ను కొద్ది సెకండ్లకే అది తిరిగి భూమిని చేరుకుంది. జపాన్‌లోని ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా గుర్తించేందుకు గాను ప్రయోగించిన మొమో-2 రాకెట్ కేవలం ఆరు సెకన్లలోనే 60 అడుగులు ఎగిరి, ఆ తర్వాత కుప్పకూలిపోయింది.

జపాన్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ రంగ రాకెట్ తయారీ సంస్థ ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ తయారు చేసిన మోమో-2 రాకెట్‌ను శాస్త్రవేత్తలు కొన్ని నెలల పాటు శ్రమించి దాదాపు 2.7 మిలియన్‌ డాలర్ల వరకూ ఖర్చు చేసి తయారు చేశారు. ఈ రాకెట్‌ను దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం నాడు ప్రయోగించారు.

సుమారు 10 మీటర్ల పొడవున్న మోమో-2 రాకెట్‌ లాంచింగ్‌ పాడ్‌ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరిన సెకండ్ల వ్యవధిలోనే  నేలను తాకింది. గతేడాది జపాన్ ప్రయోగించిన మోమో రాకెట్‌ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలమవ్వటం గమనార్హం. ఈ రాకెట్ ప్రయోగం విఫలం కావటానకి గల కారణాలను అన్వేషించి మరోసారి తిరిగి ప్రయత్నిస్తామని ఇంటర్‌స్టెల్లార్‌ వ్యవస్థాపకుడు టకఫుమి హొరీ చెప్పారు.

loader