భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.

అయితే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పాకిస్తానీయులు లాహోర్‌ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో న్యాయమూర్తి వీటిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.