సారాంశం
కింగ్ ఛార్లెస్ III నేడు పట్టాభిషిక్తుడవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన బాడీగార్డు ఒకరు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాడు. ఎలాగంటే...
బ్రిటన్‌లో ఏడు దశాబ్దాల తర్వాత జరిగే అతిపెద్ద ఉత్సవం చార్లెస్ III రాజుగా పట్టాభిషిక్తుడు అవ్వడం. నిరుడు సెప్టెంబర్‌లో చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ II మరణంతో కింగ్ చార్లెస్ యూకే, 14 ఇతర రిలీమ్స్ కు చక్రవర్తి అయ్యాడు. నేడు జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వేలాది మంది ప్రత్యక్షంగా వస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇంట్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు.
ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం చార్లెస్ III బహిరంగంగా ప్రజల్ని కలుస్తారు. ఈ క్రమంలో ఆయనకు భద్రత చాలా ముఖ్యం. క్వీన్ ఎలిజబెత్ II నుండి వారసత్వంగా వచ్చిన భద్రతా బృందం ఆయనకు రక్షణ కల్పిస్తుంది. అయితే, ప్రస్తుతం ముఖ్యంగా ఈ జట్టులోని ఒక సభ్యుడు, సోషల్ మీడియాలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. అధికారికంగా అతని పేరు ఏమిటో తెలియదు కానీ.. గడ్డం ఉన్న అంగరక్షకుడు మొదటిసారిగా సెప్టెంబర్ 8, 2022న రాణి ఎలిజబెత్ II మరణించిన సమయంలో కనిపించాడని మెట్రో నివేదించింది.
ఆ ఇంటి నిండా పాములే.. గోడల్లో, తలుపుల వెనకాల తిరుగాడుతూ పుట్టలు పుట్టలుగా సర్పాలు...
నిరుడు, ఓ కార్యక్రమంలో రాజును ఫొటోతీస్తున్న ఒక మహిళ ఫోన్‌ను ఇదే గార్డు కిందకు నెట్టడం కనిపించింది. ఇలాంటి అనేక సందర్బాల్లో ఆ బాడీగార్డ్ ప్రజల్ని ఉద్దేశించి.. ఫోన్లు వాడడం పక్కన పెట్టండి.. రాజును చూసే ఈ క్షణాలను ఆస్వాదించండి.. అని పలు సందర్భాల్లో చెప్పారు. అప్పటి నుండి, ఈ సెక్యూరిటీ గార్డు చక్రవర్తితో పాటు అతని అనేక సామాజిక కార్యక్రమాలలో కనిపిస్తాడు.
కొంతలేట్ గా అయినా.. అతను ఓ ఫాన్సీ గొడుగుతో బకింగ్‌హామ్ ప్యాలెస్ లోపలికి మరియు బయటికి వెళ్లే అనేక వీడియోలు కూడా టిక్‌టాక్‌లో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది అతనిని కోలిన్ ఫిర్త్, కింగ్స్‌మన్‌లోని హ్యారీ హార్ట్ లాంటి పాత్రలతో పోల్చారు. అతని వద్ద గొడుగులా కనిపించే తుపాకీ ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అతని గొడుగును 'గన్‌బ్రెల్లా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను సీక్రెట్ సర్వీస్ నుండి వచ్చిన వ్యక్తి అని చాలా మంది నమ్ముతుండగా, కొందరు అతని మంచి రూపాన్ని, మృదువుగా కనిపించడాన్ని అభినందించారు.
ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. అతనంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింద.. ఆయన నెక్ట్స్ జేమ్స్ బాండ్ కావాలి... అంత అద్భుతమైన వ్యక్తి.'' అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు ''అతను చాలా అందంగా ఉన్నాడు! కంప్లీట్ జెంట్" అంటే.. మరొకరేమో "గడ్డాన్నిఅంతబాగా ఎలా మెయింటేన్ చేస్తున్నాడో.. ఏమైనా చిట్కాలివ్వగలడా? అంటూ కామెంటాడు.
ఇదిలా ఉండగా, భారీ ఈవెంట్ భద్రతను పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు. రికార్డు స్థాయిలో 11,500 మంది పోలీసు అధికారులు పట్టాభిషేకానికి కాపలాగా ఉంటారని ది మెట్రో నివేదిక పేర్కొంది. ఈ కార్యక్రమానకి సుమారు 100 మంది దేశాధినేతలు హాజరవుతారు, అలాగే ప్రేక్షకులు భారీ సంఖ్యలో పాల్గొనే ఈ కార్యక్రమం కోసం భద్రతా దళాలు నెలల ముందు నుంచి తయారవుతున్నారు.