ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఏ పనిచేసినా కూడ సంచలనమే. ప్రస్తుతం ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. దేశంలో ఆహార కొరతను  నుండి బయటపడేందుకు పెంపుడు జంతువులను ప్రభుత్వానికి అప్పగించాలని కిమ్ ఆదేశించారు.

దేశంలోని సాధారణ ప్రజలు పశువులను పెంచుతారు. ధనికులు, ఉన్నతవర్గాల వారు మాత్రమే పెంపుడు కుక్కలను పెంచుతారని  కిమ్ జంగ్ ఉన్ పేర్కొన్నారు. పెంపుడు కుక్కలను కలిగి ఉండడం అనేది పెట్టుబడిదారి, బూర్జువా భావజాలమని ఆయన అభిప్రాయపడ్డారు.

పెంపుడు యాజమాన్యాన్ని నిషేధించాలని కిమ్ జంగ్ ఉన్ ఆదేశించారు. దీన్ని పాశ్చాత్య సంస్కృతిగా ఆయన అభివర్ణించారు.కుక్కల పెంపకం పెట్టుబడి విధానాలతో ముడిపడి ఉందని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయంతో ఉంది. కుక్కల పెంపకాన్ని 1980 నుండి నిషేధం ఆ దేశంలో కొనసాగుతోంది.

కరోనా ఉత్తరకొరియాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. చైనాతో వాణిజ్యం 90 శాతం పడిపోయింది. దీంతో దేశంలో ఆకలి కష్టాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నారని కొన్ని వారాల క్రితం ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

ఈ పరిస్థితుల నేపత్యంలో కొన్ని కుటుంబాలు కుక్కలను పెంపుడు జంతువులుగా కలిగి ఉండడం సంపన్నత, సంపదకు సంకేతంగా కిమ్ భావిస్తున్నారు.పెంపుడు కుక్కలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆధీనంలోని జంతు ప్రదర్శనశాలలకు పంపుతారు. మరికొన్ని కుక్కలను మాంసం కోసం రెస్టారెంట్లకు పంపుతారు.

ఉత్తరకొరియాలో కుక్కల మాంసానికి ప్రసిద్ది. ఆహార కొరత నేపథ్యంలో ఇది చాలా కులుంబాలకు ఆహార వనరుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.పెంపుడు కుక్కలు ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు అధికారులను నియమించింది ప్రభుత్వం. పెంపుడు కుక్కలు ఉన్నవాటిని గుర్తించిన తర్వాత జంతుప్రదర్శన శాలలు లేదా రెస్టారెంట్లకు తరలించనున్నారు.

పెంపుడు జంతువులను ప్రభుత్వానికి అప్పగించకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రేమగా పెంచుకొన్న పెంపుడు జంతువులను ప్రభుత్వానికి అప్పగించని అనివార్య పరిస్థితులు