సియోల్:దక్షిణ కొరియా పౌరుడిని కాల్చి చంపిన ఘటనపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ క్షమాపణలు చెప్పాడు.

సముద్ర తీరంలో దక్షిణ కొరియాకు చెందిన  సైనికులు కాల్చి చంపారు.  దక్షిణ కొరియాకు చెందిన ఫిషరీస్ అధికారిని మంగళవారం నాడు ఉత్తర కొరియా సైన్యం కాల్చి చంపింది. 

ఈ విషయమై కిమ్ జంగ్ ఉన్ స్పందించాడు. దక్షిణ కొరియా పౌరుడిని చంపడం పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత దక్షిణ కొరియాకు చెందిన వారిని ఉత్తరకొరియా చంపడం ఇదే ప్రథమం.కరోనా వైరస్ కాలంలో దక్షిణ కొరియన్లను నిరాశపర్చినందుకు కిమ్ క్షమాపణలు చెప్పారని దక్షిణ జాతీయ భద్రతా సలహాదారు సుహ్ హున్ చెప్పారు.

కిమ్ క్షమాపణలు చెప్పడం చాలా అరుదైన ఘటనగా చెబుతున్నారు. తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన వ్యక్తి తన గుర్తింపును కూడ చెప్పేందుకు నిరాకరించినట్టుగా ఉత్తరకొరియా ప్రకటించింది.

దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తిపై సుమారు 10 రౌండ్లు ఉత్తరకొరియా సైన్యం కాల్పులకు దిగింది.నీటిలోనే ఆ వ్యక్తిని చాలా గంటల పాటు విచారించిన తర్వాత కాల్చి వేశారని సియోల్ మిలటరీ అధికారులు చెబుతున్నారు.

లైఫ్ జాకెట్ ధరించిన ఈ వ్యక్తి  పశ్చిమ ద్వీపమైన యోన్పియాంగ్ సమీపంలోని పెట్రోలింగ్ నౌక నుండి అదృశ్యమయ్యాడు. ఉత్తర కొరియా దళాలు అతనిని 24 గంటల తర్వాత నీటిలో గుర్తించాయి.

మృతుడికి ఇద్దరు పిల్లలు. ఆర్ధిక సమస్యల కారణంగా ఇటీవలనే ఆయన విడాకులు తీసుకొన్నట్టుగా దక్షిణ కొరియా మీడియా ప్రకటించింది.ఉత్తరకొరియా తన సరిహద్దులను మూసివేసింది. కరోనా నుండి రక్షించుకొనేందుకు గాను ఈ ప్రయత్నం తప్పనిసరి అని ఉత్తరకొరియా ప్రకటించింది.