Asianet News TeluguAsianet News Telugu

ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సోదరి గుట్టు రట్టు.. ఐసిస్ గురించి కీలక సమాచారం?

ఇప్పటికే రస్మియా అవాద్ భర్త, అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రస్మియా నుంచి ఐసిస్ ఉగ్రకలాపాల గురించి ఎక్కువ సమచారం తెలుసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఆమె దగ్గర ఐసిస్ కి సంబంధించిన సమాచారం ఉందని వారు అనుమానిస్తున్నారు.

Killed ISIS Chief Baghdadi's Sister Captured By Turkish Forces In Syria
Author
Hyderabad, First Published Nov 5, 2019, 10:39 AM IST

ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ ని ఇటీవల అమెరికా రక్షణ రంగం అంతమొందించిన సంగతి తెలిసిందే. అమెరికన్లు వైమానిక దాడులు చేయడంతో... తప్పించుకునే దారిలేక.. బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాగా... సోమవారం బాగ్దాదీ సోదరి గుట్టు రట్టు అయ్యింది.

బాగ్ధాదీ సోదరి రస్మియా అవాద్(65) ని నార్త్ టర్క్ పట్టణణమైన అజాజ్ లో టర్కీ అధికారులు గుర్తితంచారు. అజాజ్ లో నిర్వహించిన దాడుల్లో ఆమెను గుర్తించారు. ఆమెతోపాటు మరో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే రస్మియా అవాద్ భర్త, అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రస్మియా నుంచి ఐసిస్ ఉగ్రకలాపాల గురించి ఎక్కువ సమచారం తెలుసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఆమె దగ్గర ఐసిస్ కి సంబంధించిన సమాచారం ఉందని వారు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా... ఇటీవల అమెరికా రక్షణ రంగం చేసిన దాడిలో... బాగ్దాదీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతానికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విడుదల చేసింది. పెంటగాన్‌లోఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వీడియో విడుదల చేశారు. సిరియాలోని ఇదిల్బీ ప్రావిన్స్‌లో ఉన్న బాగ్దాదీ ఇంటిపై అమెరికా సైన్యం వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. 

Killed ISIS Chief Baghdadi's Sister Captured By Turkish Forces In Syria

ఈ సందర్భంగా అమెరికా సెంట్రల్‌ కమాండ్ కమాండర్‌ కెన్నెత్‌ మెకంజీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. తమ నుంచి తప్పించుకునే క్రమంలో బాగ్దాదీ ఓ కలుగులో దాచుకున్నాడని.. అతనితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.. వారి వయస్సు 12 ఏళ్లని తెలిపారు. అమెరికా బలగాలపైకి బాగ్దాదీ కాల్పులకు పాల్పడ్డాడని.. చివరికి తనను తాను పేల్చుకున్నాడన్నారు. 

ఈ పేలుడులో ఆ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారన్నారు. బాగ్దాదీ చనిపోయిన తర్వాత ఆ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశామని కెన్నెత్ మెకంజీ తెలిపారు. అక్కడున్న కొంతమంది తమ సైన్యం దాడులకు పాల్పడ్డారని.. అదే సమయంలో అమెరికా బలగాలు వారిపై కాల్పులు జరిపి హతమార్చామని చెప్పారు. కాపపౌండ్‌ నలుగురు సూసైడ్ బాంబర్లు ఉన్నారని.. వారంతా మహిళలేనని మెకంజీ తెలిపారు. వారితో పాటు ఓ పురుషుడు కూడా ఉన్నాడని.. తాము జరిపిన దాడిలో వారంతా మరణించిన విషయాన్ని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios