వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ వద్ద విధులు నిర్వహిస్తున్న భారతీయ జర్నలిస్టుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. భారత ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని దూషించారు. దీనిపై భారత రాయభార కార్యాలయం స్పందించింది. 

విధి నిర్వహణలో ఉన్న భారతీయ జర్నలిస్ట్ ను వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు దూషించారు. ఆయనపై దాడి కూడా చేశారు. శనివారం మధ్యాహ్నం వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం వెలుపల నిరసనలపై రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో తనపై భౌతికంగా దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని జర్నలిస్టు లలిత్ ఝా ఆరోపించారు.

ఇద్దరు సిక్కులు కర్రలు పట్టుకుని భారత ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తీవ్రంగా దూషించిన వీడియోను ఝా షేర్ చేశారు. ఇద్దరు వ్యక్తులు తనను కర్రలతో కొట్టారని ఝా ఆరోపించారు. తన ప్రాణాలను కాపాడినందుకు, తన పని తాను చేసుకోవడానికి సహకరించిన సీక్రెట్ సర్వీస్ కు ఆయన తన ట్విట్టర్ పోస్ట్ లో కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ సంకల్ప సత్యాగ్రాహ దీక్షలో జగదీష్ టైట్లర్: నెటిజన్ల విమర్శలు

‘‘ఈరోజు నన్ను రక్షించినందుకు, నా పని చేసేందుకు సాయం చేసినందుకు సీక్రెట్ సర్వీస్ కు ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను ఈ విషయం హాస్పిటల్ నుంచి రాస్తూ ఉండేవాడిని. కింద ఉన్న (వీడియోలో ఉన్న వ్యక్తి) పెద్దమనిషి ఈ 2 కర్రలతో నా ఎడమ చెవిని కొట్టాడు. దీంతో నేను 911 కు కాల్ చేయవలసి వచ్చింది. భౌతిక దాడికి భయపడి నేను పోలీసు వ్యాన్ లో వెళ్లిపోయాను’’ అని లలిత్ ఝా ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు ఖలిస్తాన్ జెండాలు ఎగురవేసి అమెరికా సీక్రెట్ సర్వీస్ సమక్షంలో రాయబార కార్యాలయంపైకి దిగారు. రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామని, భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధును కూడా బెదిరించారని ఝా వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కు తెలిపారు. అయితే దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు.

ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించిందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఖలిస్థాన్ నిరసనను కవర్ చేస్తున్న ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ సీనియర్ భారతీయ జర్నలిస్టును దూషించడం, బెదిరించడం, భౌతికంగా దాడి చేయడం వంటి భయానక దృశ్యాలను చూశామని పేర్కొంది. జర్నలిస్ట్ ను మొదట మౌఖికంగా బెదిరించారని, ఆ తర్వాత శారీరకంగా దాడి చేశారని, వ్యక్తిగత భద్రత, శ్రేయస్సుకు భయపడి చట్ట అమలు సంస్థలను పిలవాల్సి వచ్చిందని, వారు వెంటనే స్పందించారని వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లలేదు- కర్ణాటకలో కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి దూసుకెళ్లిన ఘటనపై పోలీసుల వివరణ

కాగా.. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ఎదుట గుమిగూడిన ఖలిస్తానీ అనుకూల ఆందోళనకారులు మైక్ లను ఉపయోగించి ఇంగ్లీష్ పంజాబీ భాషల్లో భారత వ్యతిరేక ప్రసంగాలు చేయడం గమనార్హం. పంజాబ్ లో వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ పై పోలీసుల చర్యను నిరసిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో, కాండాలోని భారత కాన్సులేట్లపై ఖలిస్థాన్ సానుభూతిపరులు వరుస దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పరారీలో ఉన్న వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గత తొమ్మిదేళ్లుగా పరారీలో ఉండటంతో పంజాబ్ తో పాటు పొరుగు రాష్ట్రాల్లో పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.