వాషింగ్టన్: గెలుపుపై డెమోక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ధీమాను వ్యక్తం చేశారు. విశ్వాసం ఉంచాలని ఆయన కోరారు. గెలవబోతున్నామనన్నారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాటలో ఉన్నామన్నారు.తన స్వంత నగరమైన డెలావేర్లోని విల్మింగ్టన్ లో మీడియాతో పాటు తన మద్దతుదారులతో బుధవారంనాడు ఉదయం ఆయన  మాట్లాడారు. ప్రతి ఓటును లెక్కించేవరకు ఇది ముగియదన్నారు.

77 ఏళ్ల మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. 2016లో ట్రంప్ గెలిచిన  అరిజోనా రాష్ట్రం గురించి తనకు నమ్మకం ఉందన్నారు. అయితే 77 శాంత బ్యాలెట్లను లెక్కించడంలో బిడెన్ గణనీయంగా ముందున్నాడు.

also read:మనమే గెలిచాం, సుప్రీంకోర్టుకు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో  ఫలితాలను పొందడానికి మెయిల్ ఇన్ ఓటింగ్ అపూర్వంగా ఉపయోగించడం వల్ల కొంత సమయం పడుతుందని బైడెన్ హెచ్చరించారు.

మరో వైపు గెలుపుపై ట్రంప్ ధీమాగా ఉన్నాడు. విజయోత్సవాలకు సిద్దంగా ఉండాలని ఆయన కోరారు. కీలకమైన రాష్ట్రాల్లో విజయం సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ రాత్రికి అక్రమంగా ఓట్లను లెక్కిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు.