Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై పైలట్ ముచ్చట్ల వల్లే పాక్ విమాన ప్రమాదం: 97 మంది మృతి బలి

పాకిస్తాన్ విమానయాన చరిత్రలోనే ఘోర దుర్ఘటనగా అభివర్ణించిన కరాచీ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు కారణం వెలుగు చూసింది. ఈ విషాదానికి మానవ తప్పిదమే కారణమని దర్యాప్తు బృందం తేల్చింది.

karachi Plane Crash Due To Human Error, Pilots Were Discussing Coronavirus
Author
Karachi, First Published Jun 24, 2020, 4:51 PM IST

పాకిస్తాన్ విమానయాన చరిత్రలోనే ఘోర దుర్ఘటనగా అభివర్ణించిన కరాచీ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు కారణం వెలుగు చూసింది. ఈ విషాదానికి మానవ తప్పిదమే కారణమని దర్యాప్తు బృందం తేల్చింది.

పైలట్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోరం జరిగిందని వెల్లడించింది. మే 22న 99 ప్రయాణికులతో లాహోర్ నుంచి బయల్దేరిన ఎయిర్‌బస్ ఎ320 విమానాన్ని కరాచీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసే సమయంలో పైలట్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యహరించినట్లు దర్యాప్తు బృందం తెలిపింది.

Also Read:97 మందిని పొట్టనబెట్టుకున్న విషాదం: కరాచీ విమానం కూలడానికి ముందు..జరిగింది ఇదీ

వీరు ఏ మాత్రం పట్టకుండా కరోనా వైరస్ గురించి మాట్లాడుకున్నట్లు పాకిస్తాన్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్.. ఆ దేశ పార్లమెంట్‌లో బుధవారం ప్రకటించారు. పైలట్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ మాటల్లోపడి విమానం ల్యాండింగ్‌పై దృష్టి పెట్టలేదు.

కరోనా గురించి వీరంతా చర్చల్లో మునిగి తేలుతున్నారని ఆయన చెప్పారు. కాగా ఈ ఘోర దుర్ఘటనలో 97 మంది దుర్మరణం పాలవ్వగా.. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందంలో ఏవియేషన్ నిపుణులతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు కూడా ఉన్నారు. వీరు విమానానికి సంబంధించిన వాయిస్ రికార్డులు, డేటాను విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios