Asianet News TeluguAsianet News Telugu

మేము రెడీగా ఉన్నాం.. కానీ అది అంత ఈజీ కాదు.. కమలా హ్యారిస్

ప్రెసిడెంట్ బైడెన్ ఇప్పటికే వ్యాక్సిన్ తదితర విషయాల్లో పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారు. కరోనాపై పోరుకే మా తొలి ప్రాధాన్యం. ఇదే మాదిరిగా మాకు ఇతర కొన్ని ప్రధాన లక్ష్యాలు కూడా ఉన్నాయి. 

Kamala Harris: It's not going to be easy
Author
Hyderabad, First Published Jan 19, 2021, 12:44 PM IST

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఘన విజయం సాధించారు. బుధవారం ఆయనతోపాటు.. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 'బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్న తాము పని చేయడానికి రెడీగా ఉన్నాం. మాకు తెలుసు చాలా పని ఉందని, అది అంత ఈజీ కాదని కూడా..' అని కమల అన్నారు. 

వివరాల్లోకి వెళ్తే...  నేషనల్ డే ఆఫ్ సర్వీసెస్ సందర్భంగా మార్తాస్ టేబల్ స్వచ్చంధ సంస్థ అనకోస్టియాలో నిర్వహించిన కార్యక్రమంలో కమల పాల్గొని మాట్లాడారు. "బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తాము పని చేయడానికి ఇప్పటికే రెడీగా ఉన్నాం. మా ముందు చాలా పని ఉందని తెలుసు. అంతేగాక అది అంత ఈజీ కాదని కూడా తెలుసు. ప్రెసిడెంట్ బైడెన్ ఇప్పటికే వ్యాక్సిన్ తదితర విషయాల్లో పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారు. కరోనాపై పోరుకే మా తొలి ప్రాధాన్యం. ఇదే మాదిరిగా మాకు ఇతర కొన్ని ప్రధాన లక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ సాధించాలంటే మాకు తెలిసింది ఒక్కటే కష్టపడి పని చేయడం. దీనికి తోడు కాంగ్రెస్ సభ్యుల సహాకారం కూడా ఎంతో అవసరం." అని కమల చెప్పుకొచ్చారు. 

కాగా, ప్రమాణస్వీకారానికి వెళ్లడం మీరు సురక్షితమని భావిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా.. "నేను ఎంతో ఆత్రుతగా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేయపట్టడం ఎంతో గర్వకారణం. ఆ సమయం కోసం వేచి చూస్తున్నాను." అని అన్నారు. భర్త డగ్ ఎమ్హాఫ్‌తో కలిసి కమల ఈ స్వచ్చంధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల దంపతులు పేదలకు పంచిపెట్టడానికి రెడీ చేస్తున్న ఫుడ్ ప్యాకింగ్‌లో కూడా పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios