గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ దారుణహత్యకు గురయ్యారు. రియాద్ నుంచి రెండు విమానాల్లో టర్కీ వచ్చిన 15 మంది స్క్వాడ్ ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు.

ఖషోగ్గీని హత్య చేసిన తర్వాత అదే విమానాల్లో వారు తిరిగి రియాద్ వెళ్లినట్లు టర్కీ ప్రకటించింది. సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ అరేబియా ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాసాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా రాయబార కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు..

దీంతో ఖషోగ్గీని సౌదీ రాజకుటుంబం హత్య చేయిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన దారుణహత్యతో సౌదీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జమాల్ హత్యపై అమెరికా, బ్రిటన్‌లు సౌదీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో సౌదీలో జరగనున్న పెట్టుబడుల సదస్సు నుంచి యూఎస్ ట్రజరీ సెక్రటరీ స్టీవెన్ మ్నుచిన్, బ్రిటన్ అంతర్జాతీయ కార్యదర్శి లియామ్ ఫాక్స్ వైదొలిగారు.